NTR : ఉగాది కానుకగా విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు నుండే ఈ చిత్రం పై అంచనాలు వేరే లెవెల్ లో ఉండేవి. ఎందుకంటే మొదటి భాగం ‘మ్యాడ్’ చిత్రం యూత్ ఆడియన్స్ కి అంతలా నచ్చింది కాబట్టి. అప్పటికీ హీరోలందరూ కొత్త వాళ్ళు అవ్వడం, చాలా చిన్న సినిమాగా విడుదల అవ్వడం కారణంగా కలెక్షన్స్ పరంగా వేరే లెవెల్ కి వెళ్లలేకపోయింది కానీ, ఓటీటీ లో మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. మొదటి వారంలో 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిన్న రాత్రి హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో గ్రాండ్ గా జరిపారు.
Also Read : మీరు ‘కాలర్’ ఎగరేసుకునేలా చేసే బాధ్యత నాది..’దేవర 2′ ఉంటుంది – జూనియర్ ఎన్టీఆర్
ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ముఖ్య అతిథిగా పాల్గొని అభిమానులను, మూవీ టీం ని ఉత్సాహ పరిచే విధంగా స్పీచ్ అందించాడు. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘నవ్వించే టాలెంట్ అందరికీ ఉండదు. అది దొరకడం చాలా కష్టం. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారిలో అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉంది. భవిష్యత్తులో ఆయన ఎన్నో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ తన గురించి ప్రత్యేకించి మాట్లాడడంతో కళ్యాణ్ శంకర్ ఆయన కాళ్లకు దండం పెడుతాడు. అప్పుడు ఎన్టీఆర్ ‘ఇదిగో ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను..మీ తల్లిదండ్రుల కాళ్లకు నమస్కారం పెట్టండి సార్ చాలు’ అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం ఆయన సంగీత్ శోభన్ గురించి మాట్లాడుతూ ‘సంగీత్ గారి తండ్రి శోభన్ తో నాకు పెద్దగా పరిచయం లేదు కానీ, ఒక్కసారి మాత్రం ఆయన్ని కలిశాను’.
‘నా జీవితం లో అంత వినయంగా మాట్లాడిన వ్యక్తిని నేను చూడలేదు. తండ్రి గారు భౌతికంగా నీ దగ్గర లేకపోయినా ఇక్కడే మన మధ్య కూర్చొని నీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు’అని చెప్పుకొచ్చాడు. అలా సినిమా లో పని చేసిన నటీనటులందరి గురించి మాట్లాడిన తర్వాత చివర్లో నాగ వంశీ గురించి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘అత్తారింటికి దారేది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనుక ఎదో పవర్ ఉంది అని, ఆ డైలాగ్ మా వంశీ కి కూడా సూట్ అవుతుంది. చెప్పకూడదు కానీ, వంశీ కి సుఖాలు ఎక్కువ అయిపోయాయి, త్వరలోనే మేమిద్దరం కలిసి పనిచేయబోతున్నాం. మీరు ఏమి కావాలన్నా అతన్నే అడగండి ఇక, నేను రిలాక్స్ గా పని చేసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సినిమా డైలాగ్ ని ఉపయోగించడంతో పవన్ ఫ్యాన్స్ ఆ వీడియో బిట్ ని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ బాగా వైరల్ చేశారు.
Also Read : ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ కత్తి పట్టబోతున్నాడా..?
స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ డైలాగ్
– #JrNTR #MADSquare #NagaVamsi#PawanKalyan #NTR #MADForNTR pic.twitter.com/4k1Ibg3iLK
— IndiaGlitz Telugu™ (@igtelugu) April 4, 2025