NTR Dragon Movie: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈనెల 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ తో పాటు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సైతం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటివరకు చాలా మంది దర్శకులు ఎన్టీఆర్ ను వాళ్లకు నచ్చిన కోణంలో చూపిస్తే ఫస్ట్ టైం ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ ను తన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ల చూపించబోతున్నాడట. ఎన్టీఆర్ చేతిలో ఒక కత్తి పెట్టి మరి అతని చేత బీభత్సమైన ఫైటింగ్లను కూడా చేయిస్తున్నాడు. ఈ రకంగా చూపిస్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి.
మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ప్రతి సినిమా ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల్లో భారీ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేకపోవడంతో ఆయన ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఈ సినిమా విషయంలోనే స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. సినిమా రిలీజ్ కి ఎక్కువ రోజులు పట్టిన పర్లేదు కానీ సినిమా సక్సెస్ ఫుల్ గా నిలవాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ముందుకు సాగుతున్నాడు.
ఇక బర్త్ డే రోజు అతని అభిమానులు ఆనందపడేలా ప్రశాంత నీల్ ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఎన్టీఆర్ అభిమానులను అలరింపజేస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరో రెండు రోజులపాటు వెయిట్ చేయాల్సిందే…
ఇప్పటికే ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ సిరీస్, సలార్ సినిమాల సక్సెస్ తో మంచి ఊపులో ఉన్నాడు. కాబట్టి అదే హైప్ ని వాడుకుంటూ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలుపుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు ఎన్టీఆర్ కి ఈ సినిమాతో వస్తుందని భావిస్తున్నాడు…