NTR Die in War 2 Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి ఐడెంటిటిని సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే బాలయ్య బాబు నటసింహంగా ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. సీనియర్ హీరోగా పేరు ఉన్నప్పటికి వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. యంగ్ హీరోలకి సాధ్యం కానీ రీతిలో సక్సెస్ లను అందుకుంటున్నాడు. కానీ నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం మంచి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకోవడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ మార్కెట్ ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియాలో మార్కెట్ ను పదిలంగా ఉంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే దేవర (Devara) సినిమాతో పాన్ ఇండియా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన ఆ సినిమాతో 500 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టడమే కాకుండా తన ఖాతాలో ఒక మంచి సక్సెస్ ను కూడా అందించింది. ఇక ఇప్పుడు హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న వార్ 2 (War 2) సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి సిద్ధమయ్యాడు.
Also Read: War 2 Movie : ‘వార్ 2’ టీజర్ నుండి ఎన్టీఆర్ డైలాగ్ లీక్..ఈ రేంజ్ లో ఉందేంటి బాబోయ్!
ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ తొందరలోనే డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేసి డ్రాగన్ సినిమా షూటింగ్లో పాల్గొనాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ 20 నిమిషాల పాటు కనిపిస్తారట. అందులోను ఆయన పాత్ర చనిపోతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి అతనిని చంపేది ఎవరు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ని ఈ సినిమాలో మరో హీరో అయిన హృతిక్ రోషన్ (Hrithik Roshan) చంపేస్తారట. వీళ్లిద్దరి మధ్య ఒక భారీ ఫైట్ కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ పాత్ర ఈ సినిమాకి జీవం పోస్తుంది అంటూ కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం ఎన్టీఆర్ చనిపోతే ఈ సినిమా ఎలా ఆడుతుంది.
Also Read: War 2 : ‘వార్ 2’ కోసం హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడా..? ఎంతంటే!
తెలుగులో ఈ సినిమాకి అంత ఆదరణ అయితే దక్కదు అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక వాళ్లు ఆదిపురుషు (Aadipurushu) సినిమాతో ప్రభాస్ (Prabhas) కి భారీ దెబ్బేశారు. అలాగే వార్ 2 (War 2) సినిమాతో ఎన్టీఆర్ కి కూడా అలాంటి ఘటనే జరగబోతుందా అనే ధోరణిలో కొన్ని కామెంట్లు అయితే వస్తున్నాయి…