https://oktelugu.com/

NTR- Ram Charan: ‘ఆడబిడ్డతో గడిపే ప్రతీ క్షణం ఒక మధురమైన అనుభూతి’ అంటూ రామ్ చరణ్ – ఉపాసన కి శుభాకాంక్షలు తెలియచేసిన జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ కి ఇద్దరు కూడా మగపిల్లలే అనే విషయం అందరికీ తెలిసిందే, గతం లో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'ఎవరు మీలో కోటీశ్వరుడు' ప్రోగ్రాం కి ముఖ్య అతిధి గా హాజరైన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎపిసోడ్ లో ఎన్టీఆర్ సితార పాప గురించి మాట్లాడుతూ 'అదృష్టవంతుడివి అన్నా నువ్వు..నాకు ఆడబిడ్డలేదనే బాధ ఉంటుంది, ఇంటికి లక్ష్మి దేవి లాంటిది ఆడబిడ్డ' అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Written By: , Updated On : June 20, 2023 / 11:18 AM IST
NTR- Ram Charan

NTR- Ram Charan

Follow us on

NTR- Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు నేడు తల్లితండ్రులు అయ్యారు. మహాలక్ష్మి లాంటి పండింటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సర్వత్రా శుభాకాంక్షలు వెల్లువ కురుస్తుంది. కాసేపటి క్రితమే రామ్ చరణ్ తో కలిసి #RRR సినిమాలో చేసిన జూనియర్ ఎన్టీఆర్, దంపతులిద్దరికీ శుభాకాంక్షలు తెలియచేసాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ రామ్ చరణ్ మరియు ఉపాసన కి శుభాకాంక్షలు.పేరెంట్స్ క్లబ్ కి స్వాగతిస్తున్నాను, ఆడ బిడ్డతో గడిపే ప్రతీ క్షణం జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆ దేవుడు ఆ బిడ్డకి మరియు మీకు ఎనలేని సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఎన్టీఆర్ వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఈ అందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కి కృతఙ్ఞతలు తెలియచేస్తున్నారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ కి ఇద్దరు కూడా మగపిల్లలే అనే విషయం అందరికీ తెలిసిందే, గతం లో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ ప్రోగ్రాం కి ముఖ్య అతిధి గా హాజరైన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎపిసోడ్ లో ఎన్టీఆర్ సితార పాప గురించి మాట్లాడుతూ ‘అదృష్టవంతుడివి అన్నా నువ్వు..నాకు ఆడబిడ్డలేదనే బాధ ఉంటుంది, ఇంటికి లక్ష్మి దేవి లాంటిది ఆడబిడ్డ’ అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈరోజు కూడా ఆయన అదే విధంగా ఎమోషనల్ కామెంట్స్ చేసాడు.ఇక రామ్ చరణ్ కి బిడ్డ పుట్టబోతున్నాడు అనే విషయాన్నీ తెలుసుకొని మెగా అభిమానులు అపోలో హాస్పిటల్స్ కి పోటెత్తారు. అక్కడ సంబరాలు చేస్తూ రామ్ చరణ్ మరియు ఉపాసన కి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.ఇక రామ్ చరణ్ కి ఆడబిడ్డ పుట్టడం పై మిగిలిన టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.