NTR brother-In-Law First Movie Career : సినిమా ఇండస్ట్రీలో మొదటి సినిమాని చేసిన హీరో ఆ సినిమా మీద అంత బజ్ లేకపోవడం వల్ల తమ రెండోవ సినిమాను మొదట రిలీజ్ చేసి సక్సెస్ ని సాధిస్తారు. ఇక ఆ వెంటనే ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో తమ మొదటి గా చేసిన మరుగున పడిపోయిన ఆ సినిమాను వెలికి తీసి మరి రిలీజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది స్టార్ హీరోల కెరియర్ మొదట్లో ఇలాంటివి చాలానీ జరిగాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ బావమరిదిగా మ్యాడ్ (Mad) సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆయ్ (Aay) సినిమాతో మంచి నటుడిగా గుర్తింపును తెచ్చుకున్న నటుడు నార్ని నితిన్…ఈయన హీరోగా నటించిన ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఆయన మొదటి సినిమాగా స్టార్ట్ చేసినప్పటికి ఈ సినిమా మీద పెద్దగా బజ్ లేకపోవడంతో మ్యాడ్ సినిమాను తన మొదటి సినిమాగా భావించి ముందు దానిని రిలీజ్ చేశాడు.
ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది ఇక రీసెంట్ గా ‘మ్యాడ్ 2’ సినిమా కూడా రావడం దానికి కూడా మంచి గుర్తింపు రావడంతో ఇప్పుడు ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో నార్ని నితిన్ మొదటి నుంచి కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కి హాజరవ్వలేదు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోతుంది.
చాలా లిమిటెడ్ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకి సరైన ఓపెనింగ్స్ కూడా రావడం లేదు… వేగేశ్న సతీష్ (Vegesna Sathish) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రొటీన్ రొట్ట ఫార్ములాతో సాగడం దానికి మించిన స్లో నరేషన్ తో సినిమా ఉండడం వల్ల ఈ సినిమాకి పెద్దగా బజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదని తెలుస్తోంది.
‘శతమానం భవతి’ (Sathamanam Bavathi) సినిమాతో నేషనల్ అవార్డుని అందుకున్న వేగేశ్న సతీష్ ఆ తర్వాత వచ్చిన సినిమాలతో తన పూర్తి ఫామ్ ను కోల్పోయాడు. ఇక అలాంటి సందర్భంలోనే ఆయన నుంచి వచ్చిన ఈ సినిమా సైతం పెద్దగా ఆకట్టుకోకపోవడంలో పెద్దగా విశేషం అయితే ఏమీ లేదు… ఇక వేగేశ్న సతీష్ దర్శకత్వం చేయడం ఆపేస్తే మంచిదని ఔటేటెడ్ కథలతో సినిమాలను చేస్తూ ఉంటాడని సినిమా విమర్శకులు సైతం అతన్ని విమర్శిస్తున్నారు.