NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు ప్రస్తుతం భారీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతున్న నేపథ్యంలో ఒకరిని మించి మరొకరు సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాలనే క్రమం లో వీళ్ళ మధ్య పోటీ అయితే తీవ్రతరమవుతుంది. ఇక స్టార్ హీరోలందరు ముక్తకంఠంతో నెంబర్ వన్ హీరోగా ఎదిగేది నేనే అంటూ ఎవరికి వారు అనుకుంటూ మంచి సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి హీరోల మధ్య సినిమాల పరంగా పోటీ ఉండడం అనేది చాలా మంచి పద్ధతే. దీనివల్ల బెస్ట్ ప్రొడక్ట్స్ వచ్చి ప్రేక్షకులకు అలరించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లాంటి స్టార్ హీరో సైతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. ఇక ఈ సినిమా కోసమని ఆయన చాలావరకు బరువు కూడా తగ్గాడు. ఇప్పటికే ఆయన హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ లో వార్ 2 (WAR 2) అనే సినిమాని కూడా చేశాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో మరొక స్టార్ డైరెక్టర్ సైతం ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఎవరు అంటే రోహిత్ శెట్టి (Rohith Shetty)…
Also Read: అల్లు అర్జున్ అట్లీ కాంబోలో వస్తున్న సినిమా కోసం రిస్క్ చేస్తున్నారా..?
ఒకప్పుడు ఈయన కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. చెన్నై ఎక్స్ ప్రెస్, గోల్ మాల్ లాంటి సినిమాలతో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నాడు. మరి అలాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో చాలా వరకు వెనుకబడిపోయాడు. కమర్షియల్ సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను సాధించిన దర్శకుల్లో తను కూడా ఒకరు.
మరి అలాంటి ఆ దర్శకుడు ఎందుకని ఈ మధ్యకాలంలో తన ఫామ్ ని పూర్తిగా అందుకోలేకపోతున్నాడు అనే ధోరణిలో కూడా బాలీవుడ్ జనాల నుంచి కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ మార్కెట్ కి ఆయన చరిష్మా కి తగ్గట్టుగా ఒక మంచి కథను రెడీ చేశారట.
మరి ఈ కథతో ఎన్టీఆర్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించడమే కాకుండా తను కూడా స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయి మరోసారి పాన్ ఇండియాని శాసించే దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ తో ఈ సినిమా చేసే అవకాశం వస్తుందా? ఎన్టీఆర్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…