NTR Bike In RRR Movie: తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో అంతర్జాతీయంగా తెలుగు సినిమా స్థాయిని ఇనుమడింపజేశాడు. ఆయన తీస్తున్న సినిమాపై సహజంగా అంచనాలు పెరుగుతాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రేక్షకులకు ఆసక్తి నెలకొంది. ఎందుకంటే సినిమా నిర్మాణంలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు మరెవరు తీసుకోరు. సినిమా అంత పక్కాగా ఉంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడమే ఆయన విజయరహస్యం.
నందమూరి, మెగా అభిమానులకు కనువిందు చేసే విధంగా ట్రిపుల్ ఆర్ సినిమా ఉంటుందని ఆశిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన పాత్రధారులుగా కనిపిస్తారు. స్వాతంత్ర్య సమరయోధుల కథనం అయినా నేటివిటికి దగ్గరగా ఉంటుందని దర్శకుడు ఇప్పటికే చెప్పారు. దీంతో అభిమానులకు ఆసక్తి పెరుగుతోంది. రాజమౌళి తమ అభిమాన హీరోలను ఎలా చూపిస్తారోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Also Read: షాకింగ్ : సుందరం మాస్టర్ మృతి
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వాడే బుల్లెట్ కు ఓ ప్రత్యేకత ఉంది. 1920 ప్రాంతంలో వాడే వాహనం కోసం రాజమౌళి తెగ ప్రయత్నం చేశారు. బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ లోని ఓ కంపెనీ 1920 నుంచి 1950 వరకు ఈ ద్విచక్ర వాహనాన్ని తయారు చేసింది. అప్పట్లోనే 350 సీసీ, 500 సీసీ బైకులను తయారు చేయడం దాని విశిష్టత. కానీ 1971 నుంచి ఆ ఉత్పత్తి నిలిపేసింది. దీంతో రాజమౌళి ఆ నమూనా బైక్ తయారు చేయించడానికి దాదాపు రూ.20 లక్షలు ఖర్చు చేశాడని టాక్.
దీంతో ఆర్ఆర్ఆర్ మూవీపై రాజమౌళి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈసినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి బాహుబలిని బ్రేక్ చేస్తుందా? లేక యావరేజ్ గా నిలుస్తుందా అని అందరు ఎదురు చూస్తున్నారు. మొత్తానికి రాజమౌళి సినిమా అంటేనే ఓ రేంజ్ ఉంటుందనేది తెలుస్తోంది.
Also Read: ఆర్ఆర్ఆర్ మేనియా: వందల టికెట్లు కొంటున్న రాజకీయ నేతలు.. ఫ్యాన్స్ స్పెషల్ షోలు