Homeఎంటర్టైన్మెంట్Balakrishna- NTR: షాకింగ్ : మరో సంచలనానికి నాంది పలుకుతున్న ఎన్టీఆర్...

Balakrishna- NTR: షాకింగ్ : మరో సంచలనానికి నాంది పలుకుతున్న ఎన్టీఆర్ – బాలయ్య

Balakrishna- NTR: ‘బాలయ్య బాబు’ క్రేజ్ ఈ మధ్య డబుల్ అయింది. అందుకే, ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు బాలయ్య. అఖండ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్ తరువాత బాలయ్య ఎలాంటి సినిమాలతో వస్తాడా ? అని ఆశగా ఎదురుచూసారు ఫ్యాన్స్. ‘అఖండ’ అందించిన సక్సెస్ ఊపులో వరుస సినిమాలు అంగీకరిస్తున్నాడు బాలయ్య. అయితే మాకు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య ఒక దిమ్మదిరిగే కాంబినేషన్ లో సినిమా కథ విన్నాడట.

Balakrishna- NTR
Balakrishna- NTR

ఆ కథ బాలయ్యకు చాలా బాగా నచ్చిందట. ఇది మల్టీస్టారర్ అని, తండ్రీ కొడుకుల మధ్య కథ అని తెలుస్తోంది. అది కూడా ఎన్టీఆర్ తో కాంబినేషన్ లో కనుక ఈ సినిమా చేస్తే చాలా బాగుంటుందట. బాలయ్య కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని.. అవసరం అయితే, చరణ్ తో కూడా కలిసి నటిస్తా అంటూ బాలయ్య క్లారిటీ ఇచ్చాడట.

Also Read: Sushmita Sen: సుస్మితా సేన్.. ఆమె ఏ బంధంలోనూ ఇమడదు

తనకు ఎలాంటి ఇగోలు లేవు అని, కాబట్టి మల్టీస్టారర్ సినిమా చేస్తాను అని బాలయ్య స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ సినిమాని వర్కవుట్ చెయ్యడానికి చర్యలు జరుగుతున్నాయి. అసలు ఎన్టీఆర్, బాలయ్య కాంబినేషన్ అంటేనే మహా పిచ్చి లేస్తుంది అభిమానులకి. నందమూరి అభిమానులని, ఎన్టీఆర్ అభిమానులని వేర్వేరుగా ఉన్నప్పటికినీ, బాలయ్య – ఎన్టీఆర్ ఇద్దరినీ ప్రేమించే వారు, అభిమానించేవారు చాలా మంది ఉన్నారు.

అవును ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు హీరోలంతా.. తమ అభిమానుల లెక్కలు మాని, ఒక మంచి కథ కోసం కలిసి పనిచేస్తే.. ఆర్ఆర్ఆర్ లాంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలు వస్తాయి. మొత్తానికి బాలయ్య ఇండస్ట్రీ హిట్లు కోసం శ్రీకారం చుట్టాడు. ఆన్ స్టాపబుల్ షోతోనే బాలయ్య ఇండస్ట్రీ అంతా ఒక్కటే అని నిరూపించాడు. ఇప్పుడు మల్టీస్టారర్ కూడా చేస్తే.. ఇక బాలయ్య క్రేజ్ తారా స్థాయికి చేరుకుంటుంది.

Balakrishna- NTR
Balakrishna- NTR

ఏది ఏమైనా ‘బాలయ్య బాబు’ అరవై ఏళ్ల వయసులో కూడా సినిమాల వేగం మాత్రం తగ్గించడం లేదు. దీనికి తోడు, ఈ మధ్య బాలయ్య క్రేజ్ డబుల్ అయింది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు అంతా బాలయ్యతో సినిమా అనగానే మొహం చాటేసేవాళ్ళు. ఇప్పుడు బాలయ్య డేట్లు కోసం పడిగాపులు కాస్తున్నారు. బాలయ్యతో సినిమాలు చేయాలని బడా నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...
Oktelugu Epaper
Exit mobile version