NTR-ANR: సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ తత్వం అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. కానీ తొలితరంలో మాత్రం ఇద్దరి పేర్లే వినిపించేవి. ఎన్టీఆర్ జానపదం, పౌరాణిక సినిమాలతో సత్తా చాటుతుంటే.. ఏఎన్ఆర్ మాత్రం సాంఘిక సినిమాలతో జోరు చూపించేవారు. ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద చాలా సార్లు పోటీ పడ్డారు. ఒకసారి ఎన్టీఆర్ పైచేయి సాధిస్తే.. మరోసారి ఏఎన్ఆర్ హవా చూపించేవారు.

అలా వారిద్దరూ సినిమాలు ఒకే రోజు విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఒకేసారి వచ్చినా.. ప్రొడ్యూసర్లకు మాత్రం కాసుల పంట పండించేది ఇద్దరు సినిమాలు. ఒక్కోసారి వీరిద్దరూ అభిమానులు కొట్లాడుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మాత్రం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండే వారు. అలాంటి వీరిద్దరి సినిమాలు ఒక ఏడాదిలో రెండుసార్లు ఒకేరోజు విడుదలై పోటాపోటీగా నిలిచాయి.
Also Read: AP Cabinet Expansion: జగన్ కేబినెట్ లో కొత్త వారెందరు? పాత వారెందరు?
1967 ఏప్రిల్ 7న ఎన్టీఆర్ భువనసుందరి కథ ఈ సినిమాతో వచ్చారు. అదే రోజున ఎన్టీఆర్ గృహ లక్ష్మి అనే కుటుంబ కథా చిత్రం తో పోటీ పడ్డారు. ఈ రెండు సినిమాలపై కూడా విడుదలకు ముందు చాలా అంచనాలు ఉన్నాయి. కానీ పోటా పోటీలో మాత్రం ఎన్టీఆర్ విజయం సాధించారు. ఆయన నటించిన భువనసుందరి కథ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఏఎన్నార్ నటించిన గృహలక్ష్మి మాత్రం ఫ్లాప్ అయ్యింది. దీంతో అక్కినేని అభిమానులు ఆ సమయంలో తీవ్ర నిరాశ చెందారు.

ఇక 1967 లోనే మరోసారి ఇద్దరు పోటీ పడ్డారు. ఆగస్టు నెలలో ఎన్టీఆర్ నిండు మనసులు అనే సాంఘిక సినిమాతో వచ్చారు. ఏఎన్నార్ మాత్రం వసంతసేన అనే జానపద మూవీతో బరిలోకి దిగారు. ఎన్టీఆర్ ది పూర్తి బ్లాక్ అండ్ వైట్ సినిమా కాగా.. ఏఎన్ఆర్ ది కలర్ సినిమా. రెండోసారి కూడా ఎన్టీఆర్ పైచేయి సాధించారు. ఆయన నటించిన నిండు మనసులు సూపర్ హిట్టయింది. ఏఎన్ఆర్ నటించిన వసంతసేన జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇలా ఇద్దరు రెండు సార్లు పోటీ పడగా ఎన్టీఆర్ ఒకే ఏడాదిలో రెండుసార్లు తన సత్తా చూపించారు.
Also Read: KCR Mark: వరి పోరుకు కేసీఆర్ మార్క్ ‘శుభంకార్డ్’ పడనుందా?