Homeఎంటర్టైన్మెంట్Prabhas: చిరు, మ‌హేశ్ వ‌ద్ద‌న్న మూవీని చేసిన ప్ర‌భాస్‌.. చివ‌ర‌కు పెద్ద ప్లాప్‌..

Prabhas: చిరు, మ‌హేశ్ వ‌ద్ద‌న్న మూవీని చేసిన ప్ర‌భాస్‌.. చివ‌ర‌కు పెద్ద ప్లాప్‌..

Prabhas: ప్రభాస్ అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. తెలుగు హీరోలు ఎవరికీ లేనంత మార్కెట్ అతనికి ఉంది. బాహుబలి తర్వాత నేషనల్ స్టార్ గా మారిపోయాడు. అందుకే తన ప్రతి సినిమాలోను పాన్ ఇండియా లెవెల్ లోనే చేస్తున్నాడు. ప్రభాస్ ఇంత పెద్ద స్టార్ కావడానికి అతని సినీ కెరీర్ లో ఎన్నో హిట్లు కారణం. అయితే అత‌ని కెరీర్ లో చాలా వరకు ప్లాపులు కూడా ఉన్నాయి.

Prabhas
Prabhas

సినీ రంగం అంటేనే ఒకరి వద్ద రిజెక్ట్ అయిన కథ మరో హీరో వద్ద ఓకే అవుతుంది. ఇలా కొందరు హీరోలు వద్దన్న కథను వేరే హీరోల చేసి పెద్ద హిట్ కొడతారు. అలా వద్దన్న కథలు పెద్ద హిట్ అయితే మాత్రం రిజెక్టు చేసిన హీరోలకు ఉండే బాధ అంతా ఇంతా కాదు. కానీ అదే సినిమా పెద్ద ఫ్లాప్ అయితే మాత్రం రిజెక్ట్ చేసిన హీరోలు లక్కీ అనే చెప్పుకోవాలి. ఇలా ఒకప్పుడు పెద్ద హీరోలు వద్దన్న సినిమాను చేసి ప్రభాస్ అతి పెద్ద ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. ఆ సినిమానే చక్రం.

Also Read: AP Cabinet Expansion: జగన్ కేబినెట్ లో కొత్త వారెందరు? పాత వారెందరు?

కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన ఈ కథను ప్రభాస్ కంటే ముందు చిరంజీవి, మహేష్ బాబు, గోపీచంద్ రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఈ మూవీలో హీరో క్యారెక్టర్ చనిపోతుంది. అప్పట్లో హీరో పాత్ర చనిపోతే సినిమా హిట్టవ్వదనే నానుడి ఉంది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు హీరో చనిపోతే ఒప్పుకోరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చిరు, మహేష్ లు ఈ కథను రిజెక్ట్ చేశారు. కానీ ప్రభాస్ మాత్రం మొహమాటానికి పోయి ఈ సినిమాను ఓకే చేశారు.

Prabhas
Prabhas

ప్రభాస్ హీరోగా చార్మీ, ఆసిన్ లు హీరోయిన్లుగా కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ.. 2005 మార్చి 25న రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇందులో హీరో క్యాన్సర్‌తో బాధపడుతున్నా కూడా ఇతరులను నవ్వించడానికి చేసే ప్రయత్నాలు బాగుంటాయి. కానీ అతను చనిపోవడమే సినిమాకు మైనస్ అయ్యింది. దీన్ని జీర్ణించుకోలేని ప్రేక్షకులు సినిమాను ప్లాప్ చేసేశారు.

Also Read: MIM Corporators: ఇది మా అడ్డా.. ఎవరూ రావద్దు బిడ్డా అంటున్న ఎంఐఎం కార్పొరేటర్లు

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] Vaishnav Tej:  మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో ఏకంగా 80 కోట్లు కలెక్ట్ చేసి.. తనకంటూ స్టార్ డమ్ తో పాటు మార్కెట్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. అందుకే, రెండో సినిమా ‘కొండపొలం’కి మంచి బజ్ క్రియేట్ అయింది. పైగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular