NTR And Prashanth Neel Teaser: కన్నడ సినిమా ఇండస్ట్రీ లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన దర్శకుడు ప్రశాంత్ నీల్…చాలా తక్కువ సమయంలోనే పాన్ ఇండియా ను షేక్ చేసే సినిమాలను చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ ను జనవరి 26 వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…ప్రశాంత్ నీల్ సైతం తన సినిమాలంటే చాలా కేర్ తీసుకుంటాడు…కేజీఎఫ్ సినిమాతో యశ్ ను ఏ రేంజ్ లో చూపించాడో మనకు తెలిసిందే. ఇక సలార్ సినిమాలో ప్రభాస్ ను సైతం చాలా వైలెంట్ గా చూపించాడు. ఆ రెండు సినిమాలు సూపర్ సక్స్ లను సాధించడం తో ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం అలానే చూపించాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటివరకు తన కెరియర్ లో ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా లేకపోవడంతో ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాతో ఇండస్ట్రీ హిట్ దక్కుతుందనే అంచనాలో ఉన్నాడు.
ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ ఇండస్ట్రీ లో కొత్త లెక్కలను క్రియేట్ చేయగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…గతంలో చేసిన సినిమాలతో పోలిస్తే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా హై ఆక్షన్ అండ్ ఎలివేషన్ సీన్స్ తో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. రాజమౌళి సినిమాల్లో ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడో ఈ సినిమాలో అంతకు మించిన యాక్షన్ ఎపిసోడ్స్ లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తన పాత్రను ఎంతవరకు పెర్ఫెక్ట్ గా పోట్రే చేయగలుగుతాడు ఈ సినిమాతో తనను తాను మరోసారి మాస్ హీరో ఎలివేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమా ముగిసిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు.
కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా మీద తన పూర్తి డేట్స్ కేటాయించాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ అయిపోతాడు… ఇంతకు ముందు వీళ్ళ కాంబోలో ‘అరవింద సమేత వీర రాఘవ’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది. మరోసారి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా మ్యాజిక్ చేయగలుగుతోందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…