ఎన్.టి.ఆర్ హీరోగా టాప్ దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై క్లారిటీ రాకపోవడంతో అందరిలోనూ ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఏంటనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇటీవలి కాలంలో దర్శకుడు త్రివిక్రమ్ చెప్పిన కథలు నచ్చకపోవడం.. ఆర్ఆర్ఆర్ తో ఫ్యామిలీ కథ తీయాలని ఎన్టీఆర్ పట్టుబట్టడంతో వారిద్దరి సినిమా పట్టాలెక్కలేదు. తాజాగా ఎన్టీఆర్ మరో సీనియర్ దర్శకుడు కొరాటలతో జట్టుకట్టాడు.
ఎన్టీఆర్ ఇప్పుడు తన ‘జనతా గ్యారేజ్’ దర్శకుడు కొరటాల శివతో జతకడుతున్నారు. ఈ చిత్రాన్ని రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. శివ సన్నిహితుడు సుధాకర్ మిక్కిలినేని ఈ ప్రాజెక్ట్ నిర్మాతగా మారి ఈ సినిమా తీస్తున్నట్టు సమాచారం. ఇదే అతడి మొదటి సినిమా.
గత సంవత్సరం అల్లు అర్జున్ – కొరటాల శివ కలయికలో సుధాకర్ తన మొదటి చిత్రాన్ని తీస్తున్న ఒక ప్రకటనను విడుదల చేశాడు. అయితే బన్నీ సుకుమార్ తో కలిసి తీస్తున్న ‘పుష్ప’ మూవీ ఇంకా పట్టాలెక్కలేదు. అల్లు అర్జున్ చిత్రం నిలిపివేయబడింది.ఇప్పుడు ఎన్టీఆర్ తో మూవీని కొరటాల అనౌన్స్ చేస్తున్నారు.
కొరటాల మరియు ఎన్టీఆర్ చిత్రం వెంటనే ప్రారంభించబడుతుంది. ఎందుకంటే దర్శకుడు కొరటాల ఇప్పటికే చిరంజీవితో ‘ఆచార్య’ మూవీ పూర్తి చేశాడు. ఇక ఎన్టీఆర్ కూడా రాజమౌళితో ఆర్ఆర్ఆర్ పూర్తి చేశారు. దీంతో వీరిద్దరూ కొత్త చిత్రాన్ని రేపు ప్రకటించనున్నారు. ప్రస్తుత చిత్రాలైన ఆచార్య మరియు ఆర్ఆర్ఆర్ లతో చుట్టాలి.