Junior NTR :  యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీయార్…వర్కౌట్ అవుతుందంటారా..?

సినిమా ఇండస్ట్రీ లో కొంతమంది హీరోలు ఎలాంటి పాత్ర చేసిన కూడా ప్రేక్షకులు అమితంగా ఇష్టపడి చూస్తుంటారు... కారణం వాళ్ళు ఆ పాత్రలో ప్రాణం పెట్టి నటిస్తారు...అలాంటి వాళ్లలో జూనియర్ ఎన్టీయార్ ఒకరు...

Written By: Gopi, Updated On : July 31, 2024 11:28 am
Follow us on

Junior NTR :  నందమూరి నట వారసుడి గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ పాన్ ఇండియా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. నందమూరి తారక రామారావు గారి మనవడి గా ఎంట్రీ ఇచ్చిన ఈయన అతి తక్కువ సమయంలోనే తాతకు తగ్గ మనవడిగా ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో ‘దేవర ‘ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కబోతుందనే విషయాన్ని మొదటి నుంచి సినిమా యూనిట్ అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. మరి ఇప్పుడు మొదటి పార్ట్ రిలీజ్ అయిన తర్వాత రెండో పార్ట్ కు సంబంధించిన సన్నాహాలను చేసే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పుడు భారీ అంచనాలైతే లేవు… సెప్టెంబర్ 27 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ భారీ లెవెల్లో చేపట్టాలనే ఉద్దేశ్యంలో సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో పాటుగా బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ వార్ 2 అనే సినిమాని చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కూడా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీయార్ మరో కొత్త సినిమాకి కమిట్ అవ్వబోతున్నాడనే వార్తలైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ లైనప్ ఇప్పటికే చాలా పెద్దగా ఉంది. వార్ 2 సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘డ్రాగన్ ‘ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ మూడు సినిమాల తర్వాత మరొక సినిమాకి కూడా కమిట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా ‘హాయ్ నాన్న’ సినిమాతో నానికి సూపర్ సక్సెస్ ని అందించిన ‘శౌర్యువ్ ‘ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా రెండు పార్టు లుగా తెరకెక్కుబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

2026 లో ఈ మూవీ సెట్స్ మీదకి వెళితే 2028లో మొదటి పార్ట్ రిలీజ్ చేసి, 2031లో రెండో పార్ట్ రిలీజ్ చేయబోతున్నారు అంటూ భారీ ఎత్తున వార్తలైతే వస్తున్నాయి…ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం పైన సరైన క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ న్యూస్ విన్నప్పటి నుంచి పండగ చేసుకుంటున్నారు.

ఇక మరి కొంతమంది మాత్రం ఈ సినిమా ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేయలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో కూడా తెలియదు ఆ మాత్రం దానికి సినిమా అప్పుడే స్టార్ట్ అయ్యే తేదీని, మొదటి పార్ట్, రెండో పార్ట్ రిలీజ్ అయ్యే డేట్ల ను కూడా ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నారు. అసలు ఇది నిజమా అబద్దమా అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…