NHANES Report: వారంలో ఒక్కసారి కూడా కలవలేకపోతున్నారా? అయితే డేంజర్లో పడ్డట్లే.. NHANES నివేదిక ఏం చెబుతుందంటే?

పురుషుల్లో హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో శృంగారంలో పాల్గొనేందుకు కొందరు తెగ ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో మహిళలు ఆసక్తి చూపించడం లేదు.

Written By: Chai Muchhata, Updated On : July 31, 2024 11:29 am

NHANES Report

Follow us on

NHANES Report: ‘శృంగారం బంగారాన్ని మించింది’ అని అంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత విలువైనది అంటే బంగారం అని అంటారు. కానీ అంతకంటే విలువైనది శృంగారం అని కొందరు మానసిక శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఒక ఆడ, ఒక మగ కలిసి ఆనందంగా ఉంటూ రస క్రీడలో పాల్గొనడమే శృంగారం. ఈ క్రియ వల్ల ఇద్దరు అధిక సంతృప్తి పొందుతారు. ఇంతకు మించి తృప్తి మరెక్కడా దొరకదు అనేది నగ్న సత్యం. అందుకే కొందరు మగాళ్లా శృంగారం కోసం పరితపిస్తుంటారు. నవరసాలలో శృంగారం ఒక రసం. తమకు ఇష్టమైన వారితో ఈ రస క్రీడలో పాల్గొనేందుకు తెగ ఇష్టపడిపోతుంటారు. అందుకోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలి? దానికి ఉన్న నియమాలు ఏంటి? అనే విషయాలను కొందరు పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే ఇద్దరి వ్యక్తుల మధ్య ఎప్పుడైనా ఫీలింగ్ రావొచ్చు. వారిద్దరి మనసులు శృంగారాన్ని కోరుకుంటే సమయ పాలన అవసరం లేదు. అయితే ప్రస్తుత కాలంలో మనుషులు మెషీన్లలా మారిపోయారు. డబ్బు, హోదా, గౌరవం కోసం బిజీ అయిపోతున్నారు. దీంతో శృంగారంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అయితే తాజాగా కొన్ని సంస్థలు తెలిపిన నివేదికల ప్రకారం వారంలో ఒక్కసారైనా శృంగారంలో పాల్గొనాలని తేల్చాయి. ఇలా చేయడం వల్ల మరణ రేటు తగ్గుతుందని ప్రకటించాయి. మహిళలు అయితే వారంలో కనీసం ఒక్కసారైన శృంగారంలో పాల్గొనాలని పేర్కొంది. లేకుంటే వారిలో మరణ రేటు ఎక్కువవుతుందని పేర్కొంది. ఆ వివరాల్లోకి వెళితే..

పురుషుల్లో హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో శృంగారంలో పాల్గొనేందుకు కొందరు తెగ ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో మహిళలు ఆసక్తి చూపించడం లేదు. ఉద్యోగం, కుటంబ బాధ్యతలతో పాటు పలు అనారోగ్యాల బారిన పడినందున వారు తమ భాగస్వామితో పడకను పంచుకోవడానికి ముందుకు రావడం లేదు. అయితే ఇలా శృంగారం పట్ల ఆనాసక్తిగా ఉండడం వల్ల భవిష్యత్ లో ప్రమాదమేనని కొందరు నిపుణులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రీషన్ ఎగ్జామినేషన్ సర్వే (NHANES) అనే సంస్థ ఈ విషయంపై నివేదికను సమర్పించింది. మహిళలు వారంలో ఒక్కసారైనా శృంగారంలో పాల్గొనకపోతే వారిలో మరణ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పింది.

శృంగారంలో పాల్గొనడం వల్ల మనసు ఉల్లాసంగా మారుతుంది. ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతారు. శృంగారంలో పాల్గొన్నప్పుడు ఎండార్పిన్లు, ఆక్సిటోసిన్ లు విడుదల అవుతాయి. ఇవి మనసులో ఉత్తేజాన్ని పెంచి శృంగారం వైపు మరల్చుతాయి. దీంతో భాగస్వామితో కలిసి ఉండాలనే కోరిక పుడుతుంది. ఈ సమయంలో పురుషులకు ఆసక్తి ఉండి.. మహిళలకు ఆసక్తి లేకపోయినా వారిని వివిధ ప్రేరేపణల వల్ల ముగ్గులోకి దించుతారు. అప్పుడు ఇద్దరు ఒకే మూడ్ లోకి వస్తే ఆ క్షణం అద్భుతంగా గడుస్తుంది.

అయితే శృంగారంలో ఎక్కువగా పాల్గొనే మహిళలో డిప్రెషన్ తక్కువగా ఉంటుందని NHANES తెలిపింది. ఇదే సమయంలో పడక సుఖానికి దూరంగా ఉన్నవాళ్లలో మరణాల రేటు 97 శాతం ఎక్కువగా ఉందట. అయితే పురుషుల్లోనూ ఇదే ప్రభావం ఉందని చెప్పలేమని ఈ సంన్థ పేర్కొంది. కానీ మహిళలు మాత్రం తమ పార్ట్నర్ తో వారంలో ఒకసారైనా సంతోషంగా ఉండాలని చెబుతున్నారు. ఎక్కువగా శృంగారానికి దూరంగా ఉన్నవాళ్లు మానసిక సమస్యలతో బాధపడుతారు. ఫలితంగా వారి శరీరంలో అనేక మార్పులు వచ్చి గుండె సంబంధిత వ్యాధులతో పాటువ వివిధ వ్యాధులు రావడానికి కారణం అవతాయి. దీంతో మరణం వైపు ఎక్కువగా వెళ్తారని ఈ నివేదిక తెలుపుతుంది.