spot_img
Homeఎంటర్టైన్మెంట్Nandamuri Taraka Ramarao: ఎన్టీఆర్ నట విశ్వరూపం సినీ విశ్వంలోనే శాశ్వతం !

Nandamuri Taraka Ramarao: ఎన్టీఆర్ నట విశ్వరూపం సినీ విశ్వంలోనే శాశ్వతం !

Nandamuri Taraka Ramarao: తెలుగు సినిమాను శ్వాసించి శాసించిన మహా నటుడు సీనియర్ ఎన్టీఆర్ జయంతి నేడు. తెలుగు నెల ఆ మహనీయునికి ఘనంగా నివాళలర్పిస్తొంది. ఆ మహా నేతను తలుచుకుని అభిమానులు మురిసిపోతున్నారు. పైగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా ప్రతిష్టాత్మకంగా జరపబోతున్నారు. ఐతే, నేటి తరానికి సీనియర్ ఎన్టీఆర్ నటనా విధానం గురించి తెలియదు. నటనలో ఎన్టీఆర్ పద్దతి వేరు. ఆయన ఏ పాత్ర అయితే, నటించాల్సి వస్తోందో.. ఆ పాత్రలోకి పూర్తిగా పరకాయ ప్రవేశం చేసేవారు. బిచ్చగాడిలా నటించాల్సి వస్తే.. ఎన్టీఆర్ బిచ్చగాళ్ళతో కొన్నాళ్ళు స్నేహం చేసేవారు, ఒకవేళ మానసిక రోగిగా నటించాల్సి వస్తే కొన్నాళ్ళు పిచ్చాసుపత్రిలో ఉండి వస్తారు. అడవి మనిషి వేషం వేయాలంటే పచ్చి మాంసాన్ని తినేవారు. ఇలాంటి పద్ధతులలో ఎన్టీఆర్ దిట్ట. ఇది మెథడ్ యాక్టింగ్. ఇందుకు ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఎన్టీఆర్ దేవతల పాత్రలు, అవతార పురుషుల పాత్రలు వేయాల్సి వస్తే.. మాంసాహారం ముట్టకుండా కేవలం శాకాహారమే తినేవారు. అలాగే మంచాల పై కాకుండా నేలపైనే పడుకునేవారు. ఇలా చేయడం వల్ల సాత్వికత అభివృద్ధి చెందుతుందనీ, రాక్షస లక్షణాలైన తామస గుణాల నుంచి మనసు దూరమై పరిశుద్ధంగా ఉంటుందని ఎన్టీఆర్ భావించేవారు.

Nandamuri Taraka Ramarao
Nandamuri Taraka Ramarao

Also Read: Adavi Shesh Sunny Leon: అడవి శేష్ కి, సన్నీ లీయోన్ కి ఉన్న రిలేషన్ తెలుసా?

అంత గొప్పగా నిష్ఠగా ఉంటేనే.. ఆ తేజస్సు తన ముఖంలో ప్రతిఫలిస్తుందనీ ఎన్టీఆర్ గారు బాగా నమ్మేవారు. దానికి తగ్గట్టుగానే ఆయన విశ్వాసం ఎన్నడూ ఒమ్ము కాలేదు. రాక్షస / ప్రతినాయక పాత్రలు పోషించేప్పుడు ఆ లక్షణాలు తనలో పొంగిపొర్లాలని ఎన్టీఆర్ విపరీతంగా మాంసాహారం తినేవారు. ఆయన మాంసం వండించుకుని తినే సమయంలో అక్కడ ఉన్నవారు ఎన్టీఆర్ గారిని చూసి ఆశ్చర్యపోయేవారు. ఎన్టీఆర్ ఆ స్థాయిలో మాంసాన్ని తినేవారు. ఇలా ఒక పాత్ర పోషణలో భాగంగా, విపరీతమైన శారీరక కష్టాలను ఆహ్వానించి వాటికి ఓర్చడం మెథడ్ యాక్టింగ్‌ లో గొప్ప నియమం. సీనియర్ ఎన్టీఆర్ సక్సెస్ కి ఈ మెథడ్ యాక్టింగ్‌ ప్రధాన కారణం. ఎన్టీఆర్ కెరీర్ మొదట్లోనే ఇలాంటివి అనేకం చేశారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఎద్దు మీద పడే సన్నివేశం ఉంటే డూప్ అక్కరలేదని స్వయంగా చేసి కుడి చేయి విరగ్గొట్టుకున్నారు. ఆయనలో అన్నిటికన్నా ముఖ్యమైన లక్షణం ఇది. పాత్ర మానసిక స్థితిలోకి, భావోద్వేగంలోకి ప్రవేశించాకా, షాట్ గ్యాప్‌లో రామారావు ఇతరుల్లాగా వేరే పనుల్లోకి, సరదా కబుర్లలోకి దిగేవారు కాదు. ఆ పాత్ర భావోద్వేగమే అనుభవిస్తూ ఉండేవారు. అందుకే.. ఎన్టీఆర్ నట విశ్వరూపం సినీ విశ్వంలోనే శాశ్వతంగా నిలిచిపోయింది.

Also Read: Ponnur Politics: కిలారి వర్సెస్ ‘రావి’+టీడీపీ.. పొన్నూరులో వైసీపీ పతనానికి పక్కా ప్లాన్

Recommended Video:

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Nagarjuna

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Talliki Vandanam Scheme 2026

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....
NEET Protest Delhi

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...
AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper