https://oktelugu.com/

NTR Mother: ఆ విషయంలో ఎన్టీఆర్ ను హెచ్చరించిన తల్లి.. అలాంటివి సినిమాలోనే జరుగుతాయంటూ!

NTR Mother: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తల్లి పట్ల ఎంత గౌరవ మర్యాదలు ప్రేమ ఆప్యాయతలు చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం హీరోగా మన అందరి ముందు ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు గల కారణం తన తల్లి గారని ఎన్టీఆర్ ఎన్నో సందర్భాలలో బయటపెట్టారు. ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ను తన తల్లి ఒక విషయంలో బాగా గట్టిగా హెచ్చరించిందని తాజాగా ఎన్టీఆర్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2021 / 11:21 AM IST
    Follow us on

    NTR Mother: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తల్లి పట్ల ఎంత గౌరవ మర్యాదలు ప్రేమ ఆప్యాయతలు చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం హీరోగా మన అందరి ముందు ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు గల కారణం తన తల్లి గారని ఎన్టీఆర్ ఎన్నో సందర్భాలలో బయటపెట్టారు. ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ను తన తల్లి ఒక విషయంలో బాగా గట్టిగా హెచ్చరించిందని తాజాగా ఎన్టీఆర్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఎన్టీఆర్ నటించిన RRR సినిమా టైలర్ ముంబైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్కడ విలేకర్లతో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎన్నో విషయాలను బయటపెట్టారు.

    NTR Mother

    ఈ సందర్భంగా హీరో అజయ్ దేవగన్ గురించి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తన సినిమాలు చూస్తూ పెరిగానని తన నటన ఎంతో అద్భుతంగా ఉంటుందని తెలిపారు. ఆయన తనకి ఒక గురువుగా భావిస్తానని అజయ్ దేవగన్ గురించి ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. అజయ్ దేవగన్ నటన ముందు మేము ఇంకా చిన్న పిల్లలమేనని ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలిపారు. ఇక అజయ్ దేవగన్ నటించిన పూల్ ఔర్ కాంటే సినిమాలో ఈయన చేసిన బైక్ స్టంట్ నాకు ఇప్పటికీ గుర్తుందని ఎన్టీఆర్ తెలిపారు.

    Also Read: ఈ ఏడాది వివాహ బంధంలో అడుగుపెట్టిన సినీ ప్రముఖులు వీళ్లే..

    ఈ సినిమాలో అజయ్ దేవగన్ ఒకేసారి రెండు బైక్స్ పై చేసిన స్టంట్ ఎంతో అద్భుతంగా ఉందని ఆ సన్నివేశం ఇప్పటికీ నా మైండ్ లో అలాగే మెదులుతూ ఉంటుందని ఇప్పటికైనా అలాంటి స్టంట్ చేయాలనే కోరిక ఉందని తన తల్లితో చెప్పినప్పుడు ఆ విషయంలో తన తల్లి అతనికి బాగా హెచ్చరించిందని తెలిపారు. ఇలాంటివి అన్ని కేవలం సినిమాలలో మాత్రమే జరుగుతాయని, నిజ జీవితంలో ఇవి జరగవని తన తల్లి తనకి హెచ్చరించిందని ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలిపారు. ఇక RRR సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    Also Read: సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అయిన నటి జెనీలియా…