NTR 30 : ఎన్టీఆర్ కి 2023 జీరో ఇయర్ కానుంది. ఎన్టీఆర్ 30 విడుదల తేదీ ప్రకటించిన నేపథ్యంలో ఫ్యాన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. అరవింద సమేత విడుదలైన మూడున్నరేళ్ళకు ఆర్ ఆర్ ఆర్ విడుదలైంది. ఆర్ ఆర్ ఆర్ విడుదలైన రెండేళ్లకు ఎన్టీఆర్ 30 విడుదల కానుంది. న్యూ ఇయర్ పురస్కరించుకొని మేకర్స్ ఎన్టీఆర్-కొరటాల శివ మూవీ విడుదల తేదీ ప్రకటించారు. 2024 ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అంటే మరో 15 నెలల తర్వాత ఎన్టీఆర్ 30 థియేటర్స్ లోకి వస్తుంది. ఆర్ ఆర్ ఆర్ విడుదలైనప్పటి నుండి లెక్కిస్తే రెండేళ్లు. అంటే దాదాపు ఆరేళ్ళ కాలంలో ఎన్టీఆర్ చేసింది రెండు సినిమాలన్న మాట.

ఒకప్పుడు ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేసిన స్టార్ హీరోలు పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చాక ఒక్కో సినిమాకు ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్నారు. ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీలతో పోల్చితే చిరంజీవి, రవితేజ, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున జోరు చూపిస్తున్నారు. ఏడాదికి రెండు మూడు చిత్రాలు చేస్తున్నారు. చిరంజీవి ఏడాది వ్యవధిలో మూడు సినిమాలు విడుదల చేయబోతున్నారు. రవితేజ 2022లో మూడు సినిమాలు విడుదల చేయడం విశేషం.
ఎన్టీఆర్ 30 కనీసం 2023 చివర్లో విడుదల అవుతుందని అభిమానులు భావించారు. ఏకంగా 2024 సమ్మర్ కానుకగా అని చెప్పి మేకర్స్ నిరాశపరిచారు. 2022 ప్రారంభంలోనే ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అనేక కారణాలతో ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని… మార్పులు సూచించిన నేపథ్యంలో ఆలస్యమైందనే వాదన ఉంది. ఒక దశలో ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల కొరటాల ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి సంబంధించిన ఫోటోలు విడుదల చేశారు. దాంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదని క్లారిటీ వచ్చింది.
ఇక హీరో బన్నీతో అనుకున్న కథను ఎన్టీఆర్ తో కొరటాల శివ చేస్తున్నారు. అల్లు అర్జున్-కొరటాల శివ కాంబోలో మూవీ ప్రకటన జరిగి ఆగిపోయింది. ఇక ఆచార్య ఫెయిల్యూర్ తో కొరటాల ఇమేజ్ పెద్ద ఎత్తున డామేజ్ అయ్యింది. ఎన్టీఆర్ మూవీతో తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అందులోనూ ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న మూవీ కావడంతో కొరటాలకు అదొక ఛాలెంజ్. కాగా రాజమౌళితో హిట్ కొట్టిన ఏ హీరో నెక్స్ట్ మూవీ విజయం సాధించదు. రామ్ చరణ్ ఆల్రెడీ ఆచార్యతో ఈ సెంటిమెంట్ కి బలయ్యాడు.
A man's fury is the cure for a disease called courage 🔥🔥#NTR30 in cinemas on April 5th, 2024 💥
Shoot begins next month 💥
Happy New Year ❤️@tarak9999 #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @YuvasudhaArts pic.twitter.com/EleAsoa3JZ
— NTR Arts (@NTRArtsOfficial) January 1, 2023