
గుడ్డిగా విమర్శించడమే పనిగా పెట్టుకుంటే.. చరిత్రపై కనీస అవగాహన లేకపోతే.. ఎలాంటి తప్పులు జరుగుతాయో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే! రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న RRRలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి పాత్ర పోషిస్తుండగా.. ఆయన సరసన సీత పాత్రలో నటిస్తోంది అలియా.
Also Read: స్వచ్ఛమైన ప్రేమకథ.. ఆర్ఆర్ఆర్ లో ‘అల్లూరి సీత’ వ్యథ!
ఆమె బర్త్ డే సందర్భంగా సీత పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది యూనిట్. దానికి ముందు.. రాముడి విగ్రహం ముందు కూర్చున్న ప్రీ లుక్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అలియా భట్ రూపం అందరినీ ఆకర్షించింది. అచ్చ తెలుగు అమ్మాయిలా చూడగానే ఆకర్షించేలా ఉంది. దీంతో.. అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: ‘ఎవరు మీలో కోటిశ్వరులు’కోసం ఎన్టీఆర్ కు షాకింగ్ రెమ్యునరేషన్!
అయితే.. కొందరు నార్త్ బ్యాచ్ మాత్రం ముందూ వెనకా చూడకుండా విమర్శల దాడి మొదలు పెట్టారు. అస్సలు వెనక్కి తగ్గేలేదు.. RRRను బహిష్కరిస్తాం అంటూ గొడవ స్టార్ట్ చేశారు. దీనికి వాళ్లు చెబుతున్న కారణం చూస్తే.. వాళ్ల అజ్ఞానం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అలియా భట్ సీత పాత్ర పోషిస్తోంది కాబట్టి.. నిజంగా ఆమె రామాయణంలోని సీతాదేవి పాత్ర పోషిస్తోందని భ్రమపడి, ఆమెకు ఆ పాత్ర పోషించే అర్హత లేదంటూ పంచాయితీ మొదలు పెట్టారు.
ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే.. ఆమె నెపోటిజం వల్ల సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిందంటూ గోల చేస్తున్నారు. సుశాంత్ మరణం తర్వాత ఈ బంధుప్రీతి అంశం తీవ్రంగా చర్చలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ కోణంలో అలియాపై కోపం పెంచుకున్న బ్యాచ్.. ముందూ వెనకా చూడకుండా.. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా ఇలా ఆవేశపడిపోయారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
ఈ బ్యాచ్ లో కనీస జ్ఞానం లేనివారు ఉన్నారనుకుంటే ఓకే.. ఓ జర్నలిస్టు కూడా ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. దీన్నిబట్టి అల్లూరి సీతారామ రాజు తెలుసా? అంటే.. ఆయన ఎవరు అడిగేట్టున్నారు ఈ బ్యాచ్ లోని వారు. మొత్తానికి తమ అజ్ఞానాన్ని ఇలా దేశవ్యాప్తంగా నిరూపించుకుంటున్నారు.