Homeఎంటర్టైన్మెంట్Viral Video: మెట్రోలో డాన్స్ చేసిన స్టార్ హీరోయిన్... ప్రయాణికులంతా షాక్! వైరల్ వీడియో

Viral Video: మెట్రోలో డాన్స్ చేసిన స్టార్ హీరోయిన్… ప్రయాణికులంతా షాక్! వైరల్ వీడియో

Viral Video: మూవీకి ప్రమోషన్స్ చాలా అవసరం. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ప్రమోషన్స్ లో పాల్గొనాల్సిందే. అందుకు లాల్ సలామ్ మూవీ రిజల్ట్ ఒక ఉదాహరణ. రజినీకాంత్(Rajinikanth) సినిమాకు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సమాన క్రేజ్ ఉంటుంది. అలాంటిది రజినీకాంత్ ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ చేసిన లాల్ సలామ్ సినిమా విడుదలవుతున్న విషయం కూడా తెలుగు ఆడియన్స్ కి తెలియదు. ఈ విషయాన్ని పలువురు నెటిజెన్స్ వాపోతూ, కామెంట్స్ చేశారు. లాల్ సలామ్ చిత్రాన్ని సరిగా ప్రమోట్ చేయలేదు. ఫస్ట్ డే కనీస వసూళ్లు రాలేదు.

ఇక సినిమాను ప్రమోట్ చేసే విధానం కూడా మారిపోయింది. గతంలో ఇంటర్వ్యూలు, ఆడియో రిలీజ్ ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో సరిపెట్టేవారు. ఈ మధ్య స్టార్స్ పబ్లిక్ లోకి వచ్చేస్తున్నారు. అది కూడా విపరీతంగా క్రౌడ్ ఉండే ప్రదేశాల్లో తమ సినిమాలను వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నారు. షాపింగ్ మాల్స్, కాలేజీలు, మెట్రో స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ లో సందడి చేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏకంగా మెట్రో ట్రైన్ లో డాన్స్ చేసింది. ప్రయాణికులు ఒకింత ఆశ్చర్యపోయారు. ఆమెతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఆమె ఎవరో కాదు నోరా ఫతేహి. ఆమె లేటెస్ట్ మూవీ మడ్గావ్ ఎక్స్ ప్రెస్. ఈ చిత్రం మార్చి 22న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. మడ్గావ్ ఎక్స్ ప్రెస్ చిత్ర యూనిట్ తో పాటు ముంబై మెట్రో లో నోరా ఫతేహి సందడి చేసింది. ట్రైన్ లో ఓ సాంగ్ కి డాన్స్ చేసింది.

నోరా ఫతేహితో పాటు పలువురు డాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. మడ్గావ్ ఎక్స్ ప్రెస్ చిత్రంలో దివ్యేందు శర్మ, ప్రతీక్ గాంధీ కీలక రోల్స్ చేస్తున్నారు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని దర్శకుడు కునాల్ కేము తెరకెక్కించారు. కాగా నోరా ఫతేహి తెలుగులో పలు ఐటమ్ సాంగ్స్ చేసింది. నెక్స్ట్ మట్కా, హరి హర వీరమల్లు చిత్రాల్లో ఆమె నటించనుంది. తెలుగులో కూడా నోరా ఫతేహికి క్రేజ్ ఉంది.

RELATED ARTICLES

Most Popular