No Ticket Hikes in Telangana: తెలంగాణ హై కోర్టు సినీ ఇండస్ట్రీ పై కన్నెర్ర చేసింది. కొత్తగా విడుదలయ్యే భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్స్ పెంచాల్సిందిగా నిర్మాతలు పభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం, ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ కి అనుకూలంగా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడం, హై కోర్టు మందలించడం, ఆ తర్వాత ప్రభుత్వం టికెట్ రేట్స్ జీవో ని వెనక్కి తీసుకోవడం, ఈ ప్రక్రియ ‘హరి హర వీరమల్లు’ చిత్రం నుండి కొనసాగుతూనే ఉంది. ప్రీమియర్ షోస్ కి, రెగ్యులర్ షోస్ కి టికెట్ రేట్స్ పెంచరాదని ప్రభుత్వానికి ఇప్పటికే అనేకసార్లు నోటీసులు జారీ చేసింది హై కోర్టు. కానీ ప్రభుత్వం మాట వినలేదు. ఈ సంక్రాంతికి విడుదలైన ‘రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలకు టికెట్ హైక్స్ ఇచ్చింది. అయితే ‘రాజా సాబ్’ ప్రీమియర్ షోస్ కి టికెట్ హైక్స్ ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది, కానీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ కే మాత్రం ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ని ఇచ్చింది.
అయితే సరిగ్గా సినిమా విడుదలకు ముందు టికెట్ రేట్స్ జీవో ని విడుదల చేయడం, ఎవరో ఒకరు టికెట్ రేట్స్ పెంచారంటూ హై కోర్టు లో కేసు వేయడం, హై కోర్టు నుండి తీర్పు వచ్చే లోపు సినిమాలు విడుదలై, పెంచిన టికెట్ రేట్స్ మీద రన్ అవ్వడం వంటివి గడిచిన అన్ని సినిమాలకు జరిగింది. ఇక నుండి అలాంటి పరిస్థితి లేకుండా, ప్రభుత్వం ఒక సినిమాకు టికెట్ రేట్స్ పెంచాలంటే 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలంటూ నేడు హై కోర్ట్ తెలంగాణ హోమ్ డిపార్ట్మెంట్ కి ఉత్తర్వులు జారీ చేసింది. 90 రోజుల సమయం అంటే, కోర్టుయు లో పిటీషన్ వేయడానికి, వాదోపవాదనలు చేయడానికి, తీర్పు రావడానికి సరైన సమయం దొరుకుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అంటే మార్చి నెలలో టాలీవుడ్ నుండి రెండు పెద్ద సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది ‘, మరొకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ రెండిట్లో ఎదో ఒకటి విడుదల అవ్వొచ్చు. వీటితో పాటు నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రం కూడా విడుదల అవ్వొచ్చు. అన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే. ఇప్పుడు ఈ సినిమాలకు టికెట్ రేట్స్ ఇచ్చే అవకాశాలే లేవు. ఎందుకంటే 90 రోజులకంటే తక్కువ సమయం ఉంది కాబట్టి. సినీ పరిశ్రమని మొత్తానికి భలే ఇరకాటం లో పెట్టేసింది తెలంగాణ హై కోర్టు. ఎందుకు ఇంతలా టార్గెట్ చేస్తున్నారు?, సినిమా అనేది జనాలకు కేవలం ఛాయస్, ఇష్టముంటే చూస్తారు, లేదంటే లేదు, కానీ చదువు అనేది ప్రతీ ఒక్కరికి అవసరం, ప్రైవేట్ స్కూల్స్ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉంటే ఈ హై కోర్టు ఏమి చేస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
BREAKING NEWS:
No Ticket Hikes in Telangana for any movie releasing before April 19th!!
High Court Orders the Authorities to give any Hike 90 Days before release!
Gives Notices to TG Home Department after Team #MSG managed to escape Legal issues during Holidays by not making…
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) January 20, 2026
