Duniya Vijay Look From Slum Dog: ‘బద్రి’ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్… తక్కువ రోజుల్లో సినిమాలను చేయడం ఎలా అనేది పూరి జగన్నాథ్ కి తెలిసినంత గొప్పగా ఇంకెవరికి తెలియదు. ఒకప్పుడు మూడు నెలల్లో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించిన ఘనత కూడా తనకే దక్కుతుంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకి పోకిరి, బిజినెస్ మాన్ లాంటి సూపర్ డూపర్ సక్సెస్ లను అందించి అతన్ని మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది కూడా పూరి జగన్నాథ్ కావడం విశేషం…ఇక గత కొద్ది రోజుల నుంచి పూరి జగన్నాద్ కి సరైన సక్సెస్ రావడం లేదు. ఆయన చేసిన సినిమాలు చేసినట్టు డిజాస్టర్లు గా మారుతున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో చేసిన ‘లైగర్’, రామ్ తో చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా అతన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాయి.
దాంతో ఇప్పుడు విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి ‘స్లమ్ డాగ్’ అనే సినిమాని చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరో స్లమ్ నుంచి తన కెరీర్ ని మొదలుపెట్టి డాన్ గా ఎలా మారాడు అనేది ఈ సినిమాలోని మెయిన్ కథగా తెలుస్తోంది. గత 3 రోజుల క్రితం విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ పోస్టర్ ను అలాగే టైటిల్ ను రిలీజ్ చేశారు.
అలాగే ఈరోజు కన్నడ స్టార్ హీరో అయిన దునియా విజయ్ కి సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఇక ఈ సినిమాలో దునియా విజయ్ క్యారెక్టర్ ఏంటి అతను విలన్ గా చేస్తున్నాడా? లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఇద్దరు విజయ్ లను ఒక సినిమాలో భాగం చేయడం పూరి జగన్నాథ్ కి చెల్లింది అంటూ కామెంట్స్ చేస్తుండడం విశేషం…
మొత్తానికైతే ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నాడు… గతంలో అతను చేసిన పాన్ ఇండియా ప్రాజెక్టులేవీ కూడా అతనికి పెద్దగా వర్కౌట్ కాలేదు. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుంది. ప్రేక్షకుల్లో ఈ సినిమా తాలూకు ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..
Wishing the phenomenal performer who brings honesty and soul to every role,@officialsalaga, a very Happy Birthday ❤️
His character and performance
in #SLUMDOG – 33 Temple Road is going to be raw, real , and rivetingA #PuriJagannadh film @Charmmeofficial Presents… pic.twitter.com/uzhwLdUSNm
— Puri Connects (@PuriConnects) January 20, 2026
