OG Movie Premiere Shows: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ప్రస్తుతం ఓజీ(They Call Him OG) మేనియా లో మునిగి తేలుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ అద్భుతంగా పేలింది. నిన్న విడుదల చేసిన ‘గన్స్ & రోజెస్’ పాటకు కూడా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. సుజిత్ మేకింగ్ కి , తమన్ మ్యూజిక్ కి , పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆడియన్స్ మెంటలెక్కిపోతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 18వ తారీఖున విడుదల, అదే విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని 20 వ తారీఖున ఏర్పాటు చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, రీసెంట్ గా ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఒక వార్త అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.
అదేమిటంటే ఈ సినిమాకు ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ ని ఏర్పాటు చేస్తారని అభిమానులు భావించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ కూడా భారీ ఓపెనింగ్ వసూళ్లను రాబట్టడానికి ప్రీమియర్ షోస్ నే ముఖ్య కారణం అయ్యింది. కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి దాదాపుగా 16 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చింది. విడుదలకు ముందు కచ్చితంగా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వుధి అనుకున్న సినిమాకే ఈ రేంజ్ గ్రాస్ వస్తే, ఇక కచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనుకుంటున్న ‘ఓజీ’ చిత్రానికి ఇంకెంత గ్రాస్ వస్తుంది అని ఇప్పటి నుండే లెక్కలు వేసుకున్నారు. అయితే అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం ప్రీమియర్ షోస్ వేసేందుకు నిర్మాత DVV దానయ్య ఆసక్తి చూపించడం లేదట.
ఎందుకంటే సెప్టెంబర్ 25 చాలా మంచి రోజు, ఆ రోజున సినిమా విడుదల చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఆయన బలంగా నమ్ముతున్నాడట. అందుకే ప్రీమియర్ షోస్ వద్దని,దానికి బదులుగా 1AM షోస్ వేసుకుందామని ఫ్యాన్స్ తో అంటున్నాడట. ఆంధ్ర ప్రదేశ్ లో 1AM షోస్ కి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ, తెలంగాణ లో మాత్రం ఇబ్బందే. అక్కడి హై కోర్టు తెల్లవారు జామున 7 గంటలకు ముందుగా ఎలాంటి షోస్ ప్రదర్శింపరాదు అంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం అనుమతులు ఇవ్వడానికి ఒప్పుకున్నా, అక్కడి హై కోర్టు ఒప్పుకోవడం లేదు. కాబట్టి మాకు ప్రీమియర్ షోస్ నే కావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మరి ఏమి జరగబోతుందో రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది.