Baahubali Mistake: బాహుబలిలో ఈ బిగ్ మిస్టేక్ ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదా?

రాజమౌళి జీవితంలోని అదిపెద్ద కోరిక ప్రభాస్ తో బాహుబలి తీయడం. ఈ సినిమా అనుకున్నట్లు రెండు పార్టులు రావడంతో ఆయన జీవితంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.

Written By: Chai Muchhata, Updated On : May 15, 2023 6:12 pm

Baahubali Mistake

Follow us on

Baahubali Mistake: కొన్ని విషయాలను ఎదుటివాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలంటే మాటల ద్వారా.. లేదా రాతల ద్వారా చెబుతాం..కాలక్రమేణా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పత్రికల ద్వారా, వీడియోల ద్వారా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏఐ వస్తున్న రోజులు. పత్రికలు, వీడియోలు చూసేంత సమయం అందరికీ ఉండడం లేదు. దీంతో ఒక్క పదంలో విషయం మొత్తం చెప్పేలా మీమ్స్ తయారు చేస్తున్నారు. జనాలు మీమ్స్ కు అలవాటు పడడంతో ప్రతీ రంగంలోని వారు మీమ్స్ ద్వారా తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక సినిమా రంగంలోని వారిని మెచ్చుకోవాలన్నా, విమ్శించాలన్నా మీమ్స్ ద్వారానే. ఇవి కామెడీతో తో పాటు ఎమోషన్ ను పెంచుతున్నాయి. తాజాగా రాజమౌళి తీసిన బాహుబలిపై ఓ మీమ్ తెగ వైరల్ అవుతోంది.

రాజమౌళి జీవితంలోని అదిపెద్ద కోరిక ప్రభాస్ తో బాహుబలి తీయడం. ఈ సినిమా అనుకున్నట్లు రెండు పార్టులు రావడంతో ఆయన జీవితంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. బాహుబలి పార్ట్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. రాజమౌళి పనితరం ఇందులో పూర్తిగా కనిపించింది. ఈ సినిమాలో సస్పెన్స్ ను మరింత టెన్షన్ పెట్టేలా చేసింది. ఈ సినిమాలో లవ్, ఎమోషన్ తో పాటు యుద్ధ సన్నివేశాలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కాలకేయతో జరిగే యుద్దం సీన్స్ చూస్తుంటే రోమాలు నిక్కబొరుస్తాయి. కాలకేయ యుద్ధం దాదాపు 20 నిమిషాల పాటు ఉంటుంది. ఈ సమయంలో కాలకేయులను ఎదుర్కోవడానికి మహిష్మతి రాజులు త్రిశూల వ్యూహాన్ని రచిస్తారు. అలాగైతేనే వారిని ఎదుర్కోవచ్చని బాహుబలి చెబుతాడు. అలాప్లాన్ వేస్తారు.

ఎంత పెద్ద బిగ్గెస్ట్ సినిమా అయినా ఎక్కడో ఒకచోట మిస్టేక్ జరగకుండా ఉండదు. బాహుబలి సినిమాలో కూడా చాలా మిస్టేక్ వచ్చాయని కొన్ని ప్రత్యేక వీడియోలు వచ్చాయి. వీటితో ఒకదానిని మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా అది వైరల్ గా మారింది. ఇంతకీ ఇందులో ఏముందంటే కాలకేయులు, మహిష్మతి రాజులు మాట్లాడుకుంటున్నప్పడు ఒకరికొకరు వినిపిస్తాయి. కాలకేయుడు శివగామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తాడు. ఈ విషయాన్ని మహిష్మతికి చెందిన ఒకతను ట్రాన్స్ లేట్ చేస్తాడు. ఇది విన్న ప్రభాస్, రానా రెచ్చిపోతారు.

అయితే ఇరువురు ప్రత్యర్థులు పకపక్కనే ఉన్నప్పుుడ త్రిశూల వ్యూహం ఎందుకు సామీ.. దగ్గరికెళ్లి యుద్దం చేయొచ్చుగా..? అని కొందరు కామెంట్స్ పెట్టి ఆ పిక్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిని చూసిన కొందరికి లేని అనుమానాలు మొదలయ్యాయి. నిజమేగా? అని కొందరు అంటుంటే సినిమా అంటే అలాగే ఉంటుంది.. మరికొందరు కామెంట్ష్ చేశారు. ఇంకొందరు మాత్రం ఇంత పెద్ద సినిమాలో మిస్టేక్ జరుగుతూ ఉంటాయని చర్చించుకుంటున్నారు.