https://oktelugu.com/

మా యూనిట్‌లో ఎవ్వరికీ కరోనా సోకలేదు: ఆర్జీవీ

క‌రోనా కార‌ణంగా చిత్ర పరిశ్రమ ఇబ్బంది పడుతుంటే రామ్‌గోపాల్‌ వర్మ మాత్రం వరుసగా సినిమాలు తీస్తున్నాడు. లాక్‌డౌన్‌ టైమ్‌లోనే క్లైమాక్స్‌, నేక్‌డ్ మూవీలు షూట్‌ చేసి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్‌ చేశాడు. కరోనా టైమ్‌లోనే ‘కరోనా వైరస్‌’ మూవీ కూడా చిత్రీకరించాడు. ప్రణయ్, అమృతల ప్రేమ కథ ఆధారంగా  మర్డర్,  గాంధీని చంపిన గాడ్సే జీవితం ఆధారంగా ది మ్యాన్ హు కిల్డ్ గాంధీ,  కిడ్నాప్‌ ఆఫ్‌ కత్రినా కైఫ్‌, పవర్‌ స్టార్‌ అనే చిత్రాలను అనౌన్స్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 5, 2020 4:01 pm
    Follow us on


    క‌రోనా కార‌ణంగా చిత్ర పరిశ్రమ ఇబ్బంది పడుతుంటే రామ్‌గోపాల్‌ వర్మ మాత్రం వరుసగా సినిమాలు తీస్తున్నాడు. లాక్‌డౌన్‌ టైమ్‌లోనే క్లైమాక్స్‌, నేక్‌డ్ మూవీలు షూట్‌ చేసి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్‌ చేశాడు. కరోనా టైమ్‌లోనే ‘కరోనా వైరస్‌’ మూవీ కూడా చిత్రీకరించాడు. ప్రణయ్, అమృతల ప్రేమ కథ ఆధారంగా  మర్డర్,  గాంధీని చంపిన గాడ్సే జీవితం ఆధారంగా ది మ్యాన్ హు కిల్డ్ గాంధీ,  కిడ్నాప్‌ ఆఫ్‌ కత్రినా కైఫ్‌, పవర్‌ స్టార్‌ అనే చిత్రాలను అనౌన్స్‌ చేశాడు. ఆపై తన మార్కు హర్రర్  జోనర్లోకి వెళ్లి రెండు రోజుల కిందట 12 ఓ క్లాక్‌ అనే మూవీ ట్రైలర్తో ఫ్యాన్స్‌ను భయపెట్టాడు.

    ఇలా దేన్ని లెక్కచేయకుండా దూసుకెళ్తున్న ఆర్జీవీ జోరుకు కరోనా వైరస్‌ బ్రేకులు వేసిందని, ఆయన టీమ్‌లో ఒకరికి వైరస్‌ సోకిందన్న వార్తలు వచ్చాయి. దాంతో, రాము చేస్తున్న షూటింగ్స్‌ అన్నీ ఆగిపోయాయన్న వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. దీనిపై ఆర్జీవీ స్పందించాడు. ఆ వార్తలు పుకార్లే అని స్పష్టం చేశాడు.
    తన దగ్గర పని చేస్తున్న వారిలో ఎవ్వరికీ కరోనా సోకలేదని ట్వీట్‌ చేశాడు. ‘మా యూనిట్‌లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డం వ‌ల్ల షూటింగ్ నిలిపివేశామంటూ వార్తలు ప్రసారం అవుతున్నాయి. అవి తప్పు.  వాస్తవానికి మేం షూటింగ్ మొద‌లు పెట్టే ముందే యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ కోవిడ్‌ పరీక్షలు నిర్వహించాం.  అందులో అంద‌రికీ నెగెటివ్ అని వ‌చ్చింది. కోవిడ్‌ విషయంలో మేం అన్ని గైడ్‌లైన్స్‌ కఠినంగా అమలు చేస్తున్నాం’ అని రాము ట్వీట్‌ చేశాడు. దాంతో రాము జోరు ఇప్పట్లో తగ్గేలా లేదని అర్థమైంది.

    https://twitter.com/RGVzoomin/status/1279259951169327104