హాట్ బ్యూటీ ‘మాళవిక మోహనన్’ ఈ ఏడాది తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో హీరోయిన్ గా నటించి.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో ఈ ఏడాది థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాల్లో ‘మాస్టర్’ కూడా ఒకటి. అయినా ఎందుకో మాళవిక మోహనన్ కి మరో స్టార్ హీరో సినిమా ఇంతవరకు రాలేదు.
ఇప్పుడంటే కరోనా పరిస్థితుల వల్ల షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చారు గానీ, ‘మాస్టర్’ రిలీజ్ అయిన నాలుగు నెలలు అన్ని సినిమాలు ఫుల్ బిజీగా షెడ్యూల్స్ వేసుకుని షూట్ చేసుకున్నాయి, గతంలో ఎన్నడూ లేనంత స్పీడ్ గా కొత్త సినిమాలు ఓపెనింగ్ పూజలు చేసుకున్నాయి. వీటిల్లో స్టార్ హీరోల సినిమాలు దాదాపు డజనుకు పైగా ఉంటాయి. ఆ డజను సినిమాల్లో మాళవికకు సెట్ అయ్యే క్యారెక్టర్లు చాలా ఉంటాయి,
అయినప్పటికీ అమ్మడుకు మాత్రం ఒక్క డైరెక్టర్ కూడా అవకాశం ఇవ్వలేదు. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ మాళవికకు నిరాశే ఎదురైంది. అయితే, మాళవిక మోహనన్ కి ఛాన్స్ రాకపోవడానికి కారణం.. హీరోయిన్ల మధ్య ఉన్న గట్టి పోటీనే అట. రష్మిక మందాన, పూజ హెగ్డే వంటి హీరోయిన్లు పెద్ద సినిమాలన్నీ ఎగరేసుకుపోతున్నారు. ఇక అంతకన్నా పెద్ద సినిమాలు ఉంటే, మేకర్స్ బాలీవుడ్ భామలను దించుతున్నారు.
ఇక ఏవరేజ్ రేంజ్ సినిమాలను రాశి ఖన్నా, నివేదా, నభా నటేష్, సాయి పల్లవి, నిధి అగర్వాల్ వంటి భామలు మరో హీరోయిన్ కి అవకాశం ఇవ్వనియకుండా నిత్యం దర్శకనిర్మాతలతో టచ్ లో ఉంటూ… మొత్తానికి ఆ అవకాశాలన్నీ వీళ్ళే సంపాదించుకుంటున్నారు. దాంతో మాళవిక లాంటి హీరోయిన్ కి అటు బడా సినిమా లేక, ఇటు మీడియం రేంజ్ సినిమా లేక ఖాళీగా ఉండాల్సి పరిస్థితి పాపం. అన్ని ఉండి అవకాశం లేదంటే నిజంగా దారుణమే.