Homeఎంటర్టైన్మెంట్ప్లీజ్.. బిస్కెట్ లవ్ స్టోరీలు ఇక వద్దు !

ప్లీజ్.. బిస్కెట్ లవ్ స్టోరీలు ఇక వద్దు !

Nithin no to Love Stories

పాపం ప్రేమకథలు చేసి చేసి విసిగి వేసారి పోయాడు నితిన్. అందుకే ఇక లవ్ స్టోరీలకు ఎండింగ్ కార్డు వేసేశాను అంటూ ఆ మధ్య అధికారికంగా ప్రకటించాడు కూడా. అయితే, రంగ్ దే సినిమానే తన చివరాఖరి ప్రేమ కథ అంటూ హడావిడి చేశాడు. అంత చేసినా ఆ లవ్ స్టోరీ కాస్త బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది.

ఎలాగూ ప్రేమ కథ భారీగా నష్టాలు మిగిల్చింది కాబట్టి, ఇకనైనా డిఫరెంట్ స్టోరీస్ సెలక్ట్ చేసుకోవాలని నితిన్ బాగా ఉబలాట పడుతున్నాడు. అయితే, గత సినిమా చెక్ కొత్తగా వచ్చి చెత్త అనిపించుకుంది. అయినా అలాంటి సినిమాలే చేస్తాను తప్ప, రెగ్యులర్ బిస్కెట్ లవ్ స్టోరీలు ఇక చేయలేను అంటూ నితిన్ బాగా ఫిక్స్ అయిపోయాడు.

త్వరలో రిలీజ్ కానున్న మ్యాస్ట్రో సినిమా కూడా డిఫరెంట్ స్టోరీనే కాబట్టి, ఆ పరంపరను అలాగే కొనసాగించాలనేది నితిన్ ఆలోచన. ఇప్పటికే ఒప్పుకున్న ‘పవర్ పేట’ సినిమా కూడా పొలిటికల్ కాన్సెప్ట్ తో వస్తోంది. ఇది కూడా డిఫరెంట్ సినిమానే. అందుకే కేవలం డిఫరెంట్ స్టోరీలు ఉంటేనే నా దగ్గరకు రండి, లేకపోతే వద్దు అంటూ నితిన్ బోర్డు తిప్పేస్తున్నాడు.

తనకు భీష్మ లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన వెంకీ కుడుములకు కూడా కొత్త కథ ఉంటేనే చేద్దాం, లేకపోతే వద్దు అంటూ ఖరాకండిగా తేల్చిచెప్పాడు. వెంకీ ఒక పోలీసాఫీసర్ కథను రాసుకున్నాడు. కథ కామెడీగానే సాగుతుంది. మధ్యలో లైట్ గా ఎమోషన్ ఉంటుంది. పైగా బ్రదర్ సెటిమెంట్ ఉంటుంది.

మొత్తంగా అన్నదమ్ములిద్దరూ పోలీసులేనట. ఏమిటి ? పాయింట్ వినగానే పది సినిమాలు గుర్తుకొస్తున్నాయి కదా.. అందుకే నితిన్ కథ కూడా వినకుండానే వెంకీని కొత్త కథతో రమ్మన్నాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version