OG Movie Overseas Collections: కొన్ని కొన్ని సార్లు వ్యాపారాల్లో తొందరపడితే భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా సినీ రంగం లో ఇలాంటివి జరగడం ఈమధ్య కాలం లో సర్వసాధారణం అయిపోయింది. మరో 21 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం విషయం లో ఆ చిత్ర నిర్మాత DVV దానయ్య చేసిన ఒక చిన్న తొందరపాటు చర్య కారణంగా ఇప్పుడు ‘ఓజీ’ చిత్రానికి వచ్చే లాభాల్లో ఒక్క రూపాయిని కూడా సొంతం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే 2022 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 7న అప్పట్లో #RRR చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకున్నాడు ఆ చిత్ర నిర్మాత DVV దానయ్య. ఈ మేరకు ఓవర్సీస్ మొత్తం బిజినెస్ జరిపి అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా ప్రారంభించారు. కానీ కరోనా మూడవ వేవ్ మొదలు అవ్వడం తో #RRR ని అప్పటికప్పుడు వాయిదా వెయ్యాల్సి వచ్చింది.
దీంతో ఓవర్సీస్ బయ్యర్స్ కి భారీ నష్టాలు ఏర్పడ్డాయి. అక్కడి బయ్యర్స్ ముందు అనుకున్న రేట్స్ కి అయితే ఇప్పుడు మేము డబ్బులు ఇవ్వలేము, మాకు చాలా నష్టం జరిగింది అంటూ DVV దానయ్య కి చెప్పుకొచ్చారట. అప్పుడు దానయ్య నా తదుపరి చిత్రాలు అయినటువంటి ‘సరిపోదా శనివారం’, ‘ఓజీ’ చిత్రాలను మార్కెట్ వేల్యూ కంటే తక్కువ రేట్ కి అవుట్ రైట్ పద్దతి లో ఇచ్చేస్తాను అని ఒప్పందం చేసుకున్నాడట. అవుట్ రైట్ అంటే పూర్తి స్థాయి హక్కులు డిస్ట్రిబ్యూటర్ కి మాత్రమే చెందుతాయి. నిర్మాతకు భవిష్యత్తులో ఆ చిత్రం నుండి వచ్చే లాభాల్లో ఒక్క రూపాయి కూడా నిర్మాతకు వెళ్ళదు. అలా ఓజీ చిత్రాన్ని అప్పట్లో నార్త్ అమెరికా కి 2.9 మిలియన్ డాలర్స్ కి అమ్మేశాడు. ఇది ఆ సినిమాకు ఉన్న రేంజ్ కి చాలా తక్కువ అనొచ్చు.
రీసెంట్ గానే ఈ సినిమాకు నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. సినిమా విడుదలకు ఇంకా 21 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా ఈ చిత్రం అప్పుడే 1 మిలియన్ ప్రీ సేల్స్ మార్కుని నార్త్ అమెరికా లో అందుకుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని చూస్తుంటే ఈ చిత్రానికి కేవలం ప్రీమియర్ షోస్ నుండి 4 మిలియన్ డాలర్లు వచ్చేలా కనిపిస్తుంది. సినిమాకు పొరపాటున సూపర్ హిట్ టాక్ వస్తే వీకెండ్ కి 10 మిలియన్ లకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయి. అంటే అక్షరాలా 80 కోట్ల రూపాయిల గ్రాస్ అన్నమాట. ఈ మొత్తం కేవలం డిస్ట్రిబ్యూటర్ కి మాత్రమే వెళ్తుందట. ఒకవేళ అడ్వాన్స్ బేసిస్ మీద బిజినెస్ చేసి ఉండుంటే నిర్మాత దానయ్య కు లాభాల్లో భారీ వాటాలు కూడా వచ్చి ఉండేవి. బ్యాడ్ లక్ అంటే ఇదే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.