YSRCP influence in Visakha Steel Plant: విశాఖ స్టీల్( Visakha Steel) ఉద్యమం కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోందని ఉద్యోగులతో పాటు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ అటువంటిదేమీ లేదని కూటమి నేతలు చెబుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదని తేల్చి చెప్పారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ లోని ప్రధాన విభాగాలకు సంబంధించి ప్రైవేటీకరణ జరిగిపోతోంది. ఇటువంటి తరుణంలో కార్మికులతోపాటు ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇటువంటి తరుణంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి.
తలో మాటలు
వాస్తవానికి ఎంపీ శ్రీ భరత్ ( Mp sree Bharat) కొంతమంది కార్మిక సంఘ నాయకుల విషయంపై మాట్లాడారు. తన వద్దకు వచ్చి ఒకలా మాట్లాడుతున్నారని.. బయటకు వెళ్లి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. మాటలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది కార్మిక నాయకులకు నైతిక విలువలు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ కాంట్రాక్టు పోస్టులను లక్షలకు లక్షలు అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ నాయకులే కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గాజువాక లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. కార్మిక నాయకులది రాజకీయ ఎత్తుగడగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలే అలాంటి వారిపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు.
ఆ అనుమానాలతో..
ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ జరగదని కూటమినేతలు చెబుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్లకు పైగా నిధులను సమకూర్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఆ ప్లాంట్ ఉత్పత్తి కోసమే ఈ నిధులను చెబుతుండగా.. అటువంటప్పుడు సొంత గనులు కేటాయించవచ్చు కదా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల 32 విభాగాలకు సంబంధించి ప్రైవేటీకరణ జరిపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని.. కూటమి నేతలు మోసం చేస్తున్నారన్న విమర్శలు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి. అయితే వైసిపి ముసుగులో కొంతమంది కార్మిక నేతలు మాట్లాడుతున్నారన్న అనుమానం టిడిపి నాయకుల్లో ఉంది. అందులో భాగంగానే ఎంపీ శ్రీ భరత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
బ్రేకింగ్ న్యూస్
విశాఖ ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు – స్టీల్ ప్లాంట్ యూనియన్ నేతలపై తీవ్ర విమర్శలు
ఉద్యోగాల పేరిట నోటుకి నోటు పెట్టుకున్నారన్న ఆరోపణ
ఉక్కు ఉద్యమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ సంచలనం
అలాంటి నేతలు తన దగ్గరకు రాకూడదని స్పష్టం చేసిన ఎంపీ వీడియో వైరల్…… pic.twitter.com/ipyFqBnJkT
— OkTelugu (@oktelugunews) September 4, 2025