https://oktelugu.com/

త్రీ పాత్రాభినయం లో హీరో నితిన్..!

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా రూపొందిన రొమాంటిక్ చిత్రం ‘భీష్మ’ మూవీ ఈ నెల 21 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం నితిన్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో ఒక మూవీ, వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో మూవీ (రంగ్ దే ) చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే ‘భీష్మ’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన మీడియా సమావేశంలో హీరో నితిన్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కృష్ణ చైతన్య […]

Written By:
  • admin
  • , Updated On : February 20, 2020 / 07:29 PM IST
    Follow us on

    వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా రూపొందిన రొమాంటిక్ చిత్రం ‘భీష్మ’ మూవీ ఈ నెల 21 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం నితిన్ హీరోగా, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో ఒక మూవీ, వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో మూవీ (రంగ్ దే ) చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

    అయితే ‘భీష్మ’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన మీడియా సమావేశంలో హీరో నితిన్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో “పవర్ పేట” మూవీ రూపొందనుందని, ఈ మూవీ లో తాను 18, 40, 60 వయస్సు ఉన్న త్రీ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తానని, ఈ మూవీ ని మూడు భాగాలుగా తమ స్వంత బ్యానర్ లోనే రూపొందిస్తామని నితిన్ తెలిపారు, ఆగస్ట్ లో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ తన కెరీర్ లో అరుదైన సినిమా అని, తన లైఫ్ లో స్పెషల్ సినిమా అవుతుందని నితిన్ చెప్పారు.