
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు ముఖ్యమైన కారక్రమాలలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.. అమర సైనికల కుటుంబాల కోసం కేంద్రీయ సైనిక్ బోర్డ్ కు జనసేనాని కోటి రూపాయల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. అదే విధంగా.. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన సద్ధస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంటరీ సద్ధస్సులో పవన్ ప్రసంగించారు. అయితే ఆయన స్పీచ్ అంతా ఇంగ్లీషులోనే సాగింది. ఆయన స్పీచ్ అది నుండి అంతం వరకు చాలా ఆసక్తికరంగా ఉంది. దేశ యువత రాజకీయాలలో రావడానికి గల ప్రాముఖ్యతను వివరించారు.రానున్న తరాలకు రోత రాజకీయకాలను దూరం చేయాలని, భావితరాలకు అవినీతి రహిత రాజకీయాలను పరిచయం చేయడం మన బాధ్యత అని పవన్ అన్నారు. అందుకే 2014లో జనసేన పార్టీని స్థాపించినట్లు వివరించారు.
ఒకవైపు విద్యార్థులుగా మీరు నాలెడ్జి ని పెంచుకుంటేనే మరోవైపు ప్రజల తరుపున, ప్రజల కోసం పోరాడే పార్టీలకు మద్దతివ్వాలని పవన్ సూచించారు. “నా దేశం నా ప్రజలు” అనే ధోరణిలో ప్రజలకు, మన దేశానికి చేతనైన సహాయం చేయాలనీ పవన్ పిలునిచ్చారు. మధ్య మధ్యలో స్వామీ వివేకానంద కొటేషన్స్ తో విద్యార్థుల్లో ఉత్సాహం నింపె ప్రయత్నం చేశారు పవన్.
“సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చొని మురవదు,
తుఫాన్ గొంతు చిత్తం ఎరుగదు,
పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు,
నేను పిడికిది మాట్టే కావొచ్చు కానీ, గొంతెత్తితే.. ఒక దేశపు జండాకు ఉన్నంత పొగరున్నదని” పవన్ తెలుగులో చెప్పిన ఈ మాటకు యువత కేరింతలు కొట్టారు. ఈ విధంగా జనసేనాని ఆది నుండి అంతం వరకు ఇంగ్లీషులో అద్భుతమైన స్పీచ్ తో ఇరగదేశాడని చెప్పొచ్చు.