Nithin Sensationa Speech: ‘రాబిన్ హుడ్’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత హీరో నితిన్(Nithin) నుండి వస్తున్న చిత్రం ‘తమ్ముడు'(Thammudu Movie). వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం జులై 4 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ ని చూసిన తర్వాత ప్రేక్షకుల నుండి థ్రిల్లింగ్ రెస్పాన్స్ వచ్చింది. ‘తమ్ముడు’ అనే టైటిల్ చూడగానే ఎదో అక్కా తమ్ముడి మధ్య సాగే రొటీన్ డ్రామా అని ఈ సినిమాని ప్రకటించినప్పుడు అనుకున్నారు కానీ, సినిమాలో చాలా బలమైన సబ్జెక్టు ఉందని ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ ని చూసిన తర్వాతే ఆడియన్స్ కి అర్థమైంది. ఇంత పెద్ద స్కేల్ లో, ఈ రేంజ్ క్వాలిటీ తో ఈమధ్య కాలంలో నితిన్ సినిమా రాలేదు.
ఇదంతా పక్కన పెడితే ఈ ట్రైలర్ ని లాంచ్ చేసే ముందు ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో హీరో నితిన్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. నితిన్ తన గత చిత్రం ‘రాబిన్ హుడ్’ పై అంచనాలు భారీ గా పెట్టుకున్నాడు. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని బలంగా నమ్మాడు. అందుకు తగ్గట్టుగానే ప్రొమోషన్స్ లో ఆ సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు. కానీ తీరా చూస్తే ఆ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాగా నిల్చింది. నితిన్ గత చిత్రాలకు మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు ఎంత వచ్చేవో, ఆ చిత్రానికి అంత క్లోజింగ్ వచ్చింది. అందుకే ‘తమ్ముడు’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నితిన్ చాలా బ్యాలన్స్ గా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన విని ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు.
నితిన్ మాట్లాడుతూ ‘నేను నా గత చిత్రం గురించి చాలా మాట్లాడాను. అందుకే ఈ సినిమా గురించి చాలా తక్కువగా మాట్లాడుతాను. జులై 4 న సినిమానే మాట్లాడుతుంది. దిల్ రాజు గారి ఇంటి పేరు నా సినిమా పేరు అవ్వడం నాకు ఎంతో గర్వంగా ఉంది. మేము దిల్ సినిమా చేస్తున్నప్పుడు దిల్ రాజు గారు అప్పట్లోనే భారీ బడ్జెట్ ని పెట్టారు. కేవలం ఒక్క పాట కోసమే 70 లక్షలు ఖర్చు చేసాడు. నా మీద ఇంత డబ్బులు పెడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు కూడా తమ్ముడు చిత్రానికి అదే రేంజ్ లో ఖర్చు చేసాడు. నా గత చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆయన నా పై,మా డైరెక్టర్ వేణు శ్రీ రామ్ పై నమ్మకం పెట్టి ఈ రేంజ్ బడ్జెట్ ఖర్చు చేసాడు. అందుకు చాలా కృతఙ్ఞతలు’ అంటూ నితిన్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.