https://oktelugu.com/

చూపు కోల్పోతున్న నితిన్

అ ఆ చిత్రం తరవాత వరుసగా లై , చల్ మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం చిత్రాలతో అపజయాలు ఎదుర్కొన్న యువ కథానాయకుడు నితిన్.`భీష్మ` సినిమా తో బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ కొట్టాడు.ఇపుడు నితిన్ మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి హిందీ రీమేక్ సినిమా. బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు నటించగా సూపర్ హిట్ అయిన `అంధాదున్` సినిమా ఇపుడు తెలుగులో రాబోతుంది. దాని రీమేక్ హక్కులను […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 18, 2020 / 06:52 PM IST
    Follow us on

    అ ఆ చిత్రం తరవాత వరుసగా లై , చల్ మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం చిత్రాలతో అపజయాలు ఎదుర్కొన్న యువ కథానాయకుడు నితిన్.`భీష్మ` సినిమా తో బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ కొట్టాడు.ఇపుడు నితిన్ మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి హిందీ రీమేక్ సినిమా. బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు నటించగా సూపర్ హిట్ అయిన `అంధాదున్` సినిమా ఇపుడు తెలుగులో రాబోతుంది. దాని రీమేక్ హక్కులను నితిన్ దక్కించుకున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల లాంఛనంగా సినిమా కూడా ప్రారంభం అయింది.ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రంగ్ దే సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమాను పట్టాలు ఎక్కించడానికి నితిన్ ప్లాన్ చేస్తున్నాడు.

    ఇక ఈ చిత్రంలో రాధికా అప్టే పాత్రకు గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ను సంప్రదించారట. అయితే ఆ పాత్రలో నటించడానికి ప్రియాంక అరుల్ మోహన్ నో చెప్పేసిందని తెలుస్తోంది .అలాగే హిందీలో టబు చేసిన పాత్రలో నటింపచేయడానికి టబునే ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ సినిమాలో నితిన్ అంధుడిగా ఒక ఛాలెంజ్ తో కూడిన పాత్రలో నటించ బోతున్నాడు. నితిన్ తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.
    Waiting for betterment