https://oktelugu.com/

Nithiin, Tamannaah’s Maestro: నితిన్‌ అద్భుతం.. తమన్నా పర్ఫెక్ట్.. ‘మాస్ట్రో’ విశేషాలు !

Nithiin, Tamannaah’s Maestro: సినిమా ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు మేర్లపాక గాంధీ. విషయం ఉన్న యంగ్ డైరెక్టర్స్ లిస్టు లో మొదటి వరుసలో నిలిచే వ్యక్తి మేర్లపాక గాంధీ. మరీ ఈ దర్శకుడు నుంచి రాబోతున్న సినిమా ‘మాస్ట్రో’. హిందీ ‘అంధా ధున్‌’కి ఈ సినిమా రీమేక్‌. ఈ చిత్రం ఈ నెల 17 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ ఈ సినిమా గురించి పలు […]

Written By:
  • admin
  • , Updated On : September 14, 2021 / 12:47 PM IST
    Follow us on

    Nithiin, Tamannaah’s Maestro: సినిమా ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు మేర్లపాక గాంధీ. విషయం ఉన్న యంగ్ డైరెక్టర్స్ లిస్టు లో మొదటి వరుసలో నిలిచే వ్యక్తి మేర్లపాక గాంధీ. మరీ ఈ దర్శకుడు నుంచి రాబోతున్న సినిమా ‘మాస్ట్రో’. హిందీ ‘అంధా ధున్‌’కి ఈ సినిమా రీమేక్‌. ఈ చిత్రం ఈ నెల 17 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ ఈ సినిమా గురించి పలు విశేషాలు చెప్పుకొచ్చాడు.

    మేర్లపాక గాంధీ మాటల్లోనే.. ‘సహజంగా రీమేక్‌ సినిమాకి పోలికలు ఎక్కువ పెడుతూ ఉంటారు. సరే అని ఉన్నది ఉన్నట్లు చేస్తే.. కాపీ, పేస్ట్‌ అని విమర్శలు చేస్తారు. పోనీ మార్పులు చేసి సినిమా చేస్తే.. ఒరిజినల్‌ ఫిల్మ్‌ సోల్‌ ను చెడగొట్టాడు అని దర్శకుడిని బూతులు తిడతారు. రీమేక్స్‌ కి ఇలాంటి బలమైన సమస్యలు ఉన్నాయి కాబట్టే.. రీమేక్ ల జోలికి వెళ్ళాలి అంటే భయపడతాం.

    అయితే అంధా ధున్‌ లోని థ్రిల్లింగ్, డార్క్‌ హ్యూమర్‌ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఆ సినిమాని తెలుగులోకి రీమేక్‌ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత నిర్మాత సుధాకర్‌ రెడ్డి గారు ఈ సినిమా కోసం నన్ను సంప్రదించడం జరిగింది. మన నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేయమని చెప్పారు.

    నేను కూడా కొన్ని మార్పులు చేయాలని ముందే నిర్ణయించుకున్నాను. ముఖ్యంగా లవ్‌ స్టోరీని మార్చాలి అనుకున్నాను. అలాగే కొన్ని మార్పులు చేశాము. ఇక ‘మాస్ట్రో’లో నితిన్‌ అంధుడిగా అద్భుతంగా నటించారు. హిందీలో టబు చేసిన బోల్డ్ రోల్‌ కు తమన్నా పూర్తీ న్యాయం చేసింది.

    ఇక ఈ సినిమాని రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో ఎన్‌. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. నిర్మాతలు సినిమా పట్ల పూర్తీ సంతోషంగా ఉన్నందుకు హ్యాపీగా అనిపించింది. ఇక నా వర్క్ స్టైల్ కి వస్తే.. ఒక స్క్రిప్ట్‌ అనుకుని డెవలప్‌ చేస్తూ, కొన్ని నెలలు ట్రావెల్‌ చేశాక అది ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోతే ఇంకో కొత్త స్క్రిప్ట్‌ ను స్టార్ట్‌ చేస్తా. అందుకే నా సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్‌ వస్తోంది అంటూ గాంధీ చెప్పుకొచ్చాడు.