Nithiin: పాలిటిక్స్ లోకి నితిన్… పార్టీ, నియోజకవర్గం ఖరారు?

ఇక నితిన్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారట. నితిన్ నిజామాబాద్ కి చెందినవాడు కావడంతో పాటు అక్కడ ఆయనకు మంచి పట్టుందట. అందుకే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి బరిలో నిలుస్తాడట. ఈ మేరకు టాలీవుడ్ వర్గాల్లో ఓ వార్త హల్చల్ చేస్తుంది. అయితే ఈ పుకార్లను కొందరు కొట్టిపారేస్తున్నారు.

Written By: Shiva, Updated On : July 7, 2023 10:18 am

Nithiin

Follow us on

Nithiin: హీరో నితిన్ రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కొన్ని నెలల్లో తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ విజయంపై విశ్వాసంతో ఉన్నాయి. సీట్ల పంపకాల కార్యక్రమం కూడా మొదలైంది. నితిన్ ఎన్నికల బరిలో దిగుతున్నాడట. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారట. కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ఎన్నికల్లో నిలబడతారట.

ఇక నితిన్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారట. నితిన్ నిజామాబాద్ కి చెందినవాడు కావడంతో పాటు అక్కడ ఆయనకు మంచి పట్టుందట. అందుకే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి బరిలో నిలుస్తాడట. ఈ మేరకు టాలీవుడ్ వర్గాల్లో ఓ వార్త హల్చల్ చేస్తుంది. అయితే ఈ పుకార్లను కొందరు కొట్టిపారేస్తున్నారు. అవన్నీ అపోహలు, ఊహాగానాలు మాత్రమే అంటున్నారు. నితిన్ తన మేనమామ నగేష్ రెడ్డికి నిజామాబాద్ రూరల్ టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు.

నగేష్ రెడ్డి చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పదేళ్లకు పైగా పనిచేశారు. ఆయన ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారట. ఇటీవల రేవంత్ రెడ్డిని కలిశారట. ఆయన సర్వేల ఆధారంగానే టికెట్స్ కేటాయింపు ఉంటుందని చెప్పారట. ఈ క్రమంలో నగేష్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించేందుకు నితిన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లేదంటున్నారు. ఆ మధ్య నితిన్ బీజేపీ నేత అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే.

మరోవైపు నితిన్ కెరీర్ ఆశాజనకంగా లేదు. భీష్మ అనంతరం ఆయనకు హిట్ లేదు. లేటెస్ట్ రిలీజ్ మాచర్ల నియోజకవర్గం నిరాశపరిచింది. దీంతో భీష్మ దర్శకుడు వెంకీ కుడుమలతో ప్రాజెక్ట్ ప్రకటించారు. మరోసారి సారి రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పైనే నితిన్ ఆశలు పెట్టుకున్నాడు.