అందాల చందమామ కాజల్ అగర్వాల్ తల్లి కావాలని కోరుకుంటుంది నిషా అగర్వాల్. గతేడాది పెళ్ళి చేసుకొంది కాజల్. పెళ్లి అయిన నాలుగు నెలల తర్వాత నుండి తన భర్త గౌతమ్ కిచ్లుతో ముంబైలోనే కాపురం పెట్టి.. భర్తతో ఏకాంతంగా గడుపుతుంది. ఇక ఈ 36 ఏళ్ల చందమామ నిన్న పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది.
అయితే, వచ్చే పుట్టిన రోజు నాటికి కాజల్ తల్లి కావాలి అని, అచ్చం కాజల్ లాంటి ఆడపిల్లకు ఆమె జన్మను ఇవ్వాలని కాజల్ చెల్లి నిషా కోరిక. తన అక్క బర్త్ డే పార్టీలో కూడా నిషా తన కోరికని అందరి ముందు బయట పెట్టిందట. మరి చెల్లి కోరికను కాజల్ తీరుస్తోందా ? సినిమాల కోసం హాట్ ఫోటో షూట్ లు చేస్తూ తెగ బిజీగా ఉన్న కాజల్, పిల్లలు కోసం టైం కేటాయిస్తోందా అన్నదే ఇక్కడ ప్రశ్న.
ఇక నిషా అగర్వాల్ విషయానికి వస్తే.. ఏడేళ్ల క్రితమే పెళ్లి చేసుకొంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కొడుక్కి మూడేళ్లు. తన అక్క కూడా తొందర్లో ఒక అమ్మాయినో, అబ్బాయినో కంటే తన కొడుకు ఆడుకోవడానికి ఓ తోడు దొరుకుతుందని నిషా అగర్వాల్ తాపత్రయం. కాకపోతే చెల్లెలి కోరికని కాజల్ ఇప్పట్లో తీర్చడం దాదాపు కష్టమే.
ప్రస్తుతం కాజల్ ‘ఆచార్య’ సినిమాతో పాటు ఇండియన్ 2 లో కూడా నటిస్తోంది, అలాగే ఒక తమిళ థ్రిల్లర్ మూవీ కూడా చేస్తోంది. రీసెంట్ గా నాగార్జున సరసన ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో ఒక సినిమాని ఒప్పుకుంది. ఇక బాలీవుడ్ లో ‘ఉమా’ అనే ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి తెగ ఉత్సాహం చూపిస్తోంది.