Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయిల మనసుల్ని దోచిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నిఖిల్ మాత్రమే. హౌస్ లో అందంగా ఉన్న అమ్మాయిలంతా నిఖిల్ చుట్టూనే తిరిగేవారు. ముఖ్యంగా ఆడపులి అని అనిపించుకున్న యష్మీ లాంటి కంటెస్టెంట్స్ కూడా ఇతనికి ఆకర్షితం అవ్వకుండా ఉండలేకపోయింది. వీళ్లంతా అతని వెంట పడి, చివరికి మమ్మల్ని తన గేమ్ కోసం వాడుకున్నాడు అనే నిందలు కూడా నిఖిల్ భరించాల్సి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే నిఖిల్ కి గతం లో కావ్య అనే ప్రేయసి ఉండేది. వీళ్లిద్దరు కలిసి ఎన్నో ఈవెంట్స్ చేసారు, సీరియల్స్ చేసారు, యూట్యూబ్ లో అయితే లెక్కలేనన్ని వీడియోలు చేసారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని అనుకున్న ఈ జంట కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. హౌస్ లోకి ఆయన సోలో గానే అడుగుపెట్టాడు.
నిఖిల్ సింగిల్ అనే విషయం పై క్లారిటీ ఉండడం వల్లే హౌస్ లో అమ్మాయిలు ఇతని వెంట పడ్డారు. కానీ అతని మనసులో ఇంకా కావ్య ఉంది అనే విషయం 12 వారం తెలిసింది. యష్మీ కి కూడా అప్పుడే తెలియడం తో ఆమె మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఇది ముందే చెప్పి ఉండుంటే తన గేమ్ తాను ఆడుకొని ఉండేది కదా, నిఖిల్ ఇక్కడ చాలా పెద్ద తప్పు చేశాడంటూ ఆయన అభిమానులు సైతం అభిప్రాయ పడ్డారు. నిఖిల్ కి కావ్యతో కలవాలని ఉంది, కానీ కావ్య మాత్రం నిఖిల్ ని నమ్మడం లేదు. అతను నాటకాలు ఆడుతున్నాడు అని ఇంస్టాగ్రామ్ లో అనేక సార్లు స్టోరీలను పెట్టింది. అదే విధంగా నిఖిల్ తో చిన్న ట్రాక్ నడిపిన సోనియా కూడా ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా మారింది. ఒక్క యష్మీ తప్ప, నిఖిల్ పై మనసు పడిన ప్రతీ అమ్మాయి అతనికి కాకుండా ఇప్పుడు గౌతమ్ కి సపోర్టు చేస్తున్నారు.
ఈ సీజన్ ప్రారంభానికి ముందు స్టార్ మా ఛానల్ లో ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్’ అనే షో స్టార్ మా ఛానల్ లో ప్రసారమై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ షోలో నిఖిల్ తో పాటు గౌతమ్ కూడా ఉన్నాడు. సీజన్ 8 లో పాల్గొన్న టేస్టీ తేజ, ప్రేరణ, విష్ణు ప్రియా వంటి వారు కూడా ఈ షోలో పాల్గొన్నారు. అయితే ఈ షోలో నిఖిల్ పై రీతూ చౌదరి మనసు పడింది. అతనికి షో మొత్తం పులిహోర కలుపుతూ తన డ్రీం బాయ్ అని చెప్పుకొని తిరిగింది. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడితే కచ్చితంగా నిఖిల్ తో లవ్ ట్రాక్ నడుపుతుందని అందరూ అనుకున్నారు. కానీ రాలేదు. బయట నుండి సపోర్టు చేస్తుందని అనుకున్నారు. కానీ ఆమె నిజాయితీగా ఆడుతున్న గౌతమ్ కి కనెక్ట్ అయ్యింది. ఫినాలే లో గౌతమ్ కి ఓట్లు వేసి గెలిపించండి అంటూ తన ఇంస్టాగ్రామ్ లో ప్రమోట్ చేస్తుంది. ఇలా నిఖిల్ ని ఒకప్పుడు ఇష్టపడిన అమ్మాయిలు ఇప్పుడు గౌతమ్ గెలుపు కోసం ఫైట్ చేస్తున్నారు.