https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : ఒళ్ళు జలదరించేలా చేసిన గౌతమ్ AV వీడియో..ఇలాంటి బిగ్ బాస్ జర్నీ భవిష్యత్తులో ఏ కంటెస్టెంట్ కి చూడలేం!

ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన టాప్ 5 కంటెస్టెంట్స్ AV వీడియోలు నిన్నటి నుండి మొదలయ్యాయి.

Written By: , Updated On : December 13, 2024 / 08:08 AM IST
Gautham

Gautham

Follow us on

Bigg Boss Telugu 8 :  ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన టాప్ 5 కంటెస్టెంట్స్ AV వీడియోలు నిన్నటి నుండి మొదలయ్యాయి. నిన్న గౌతమ్, అవినాష్ AV వీడియోలు వేశారు. వీటిలో గౌతమ్ AV వీడియో ఒక బ్లాక్ బస్టర్ సినిమాని తలపించింది. అసలు గౌతమ్ లేకపోతే ఈ సీజన్ లేదు అనే రేంజ్ లో బిగ్ బాస్ ఈ వీడియో ని ఎడిట్ చేసి ఇచ్చాడు. భూతద్దం పెట్టి వెతికినా ఒక్క తప్పు కూడా గౌతమ్ లో కనపడలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అలాంటి అద్భుతమైన జర్నీ ని సంపాదించుకున్నాడు గౌతమ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సీజన్ ని గౌతమ్ కి ముందు, గౌతమ్ కి తర్వాత అని విభజించవచ్చు. ఆయన వచ్చిన తర్వాతనే సీజన్ మరో లెవెల్ కి వెళ్ళింది. ఎంటర్టైన్మెంట్ పరంగా ఈ సీజన్ ని అవినాష్ లేపితే, మిగిలిన విషయాల్లో గౌతమ్ లేపాడు.

హౌస్ లో ఉన్న ప్రతీ కంటెస్టెంట్ తో ఆయనకి దాదాపుగా గొడవలు అయ్యాయి. తన మనసుకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళాడు. ఇతర కంటెస్టెంట్స్ గురించి తప్పుగా మాట్లాడడం, గోతులు తవ్వడం వంటి కార్యక్రమాలు చేయలేదు. నిజాయితీగా గేమ్ ఆడాడు, ఇంత దూరం వచ్చాడు. ఒక వైల్డ్ కార్డు కంటెస్టెంట్ హౌస్ లోపలకు అడుగుపెట్టి నామినేషన్స్ ని ఎదురుకోవడమే పెద్ద సవాల్. మొట్టమొదటిసారి నామినేషన్ ని ఎదురుకున్న ప్రతీ వైల్డ్ ఈ సీజన్ లో దాదాపుగా ఎలిమినేట్ అయ్యారు. గౌతమ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. కానీ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం వల్ల గౌతమ్ కి ఒక ఛాన్స్ వచ్చింది. ఆ వచ్చిన ఛాన్స్ ని ఆయన అద్భుతంగా వినియోగించుకున్నాడు. తనలోని నెగటివ్ యాంగిల్స్ మొత్తాన్ని కవర్ చేసుకుంటూ, తనని తానూ మార్చుకుంటూ ముందుకు దూసుకెళ్లాడు. ఒక వైల్డ్ కార్డు కంటెస్టెంట్ టాప్ 5 వరకు రావడమే ఒక అద్భుతం. అలాంటిది ఏకంగా విన్నర్ రేస్ లోకి వచ్చాడంటే ఆయన ఆట తీరు ఎంత గొప్పగా ఉన్నిందో అర్థం చేసుకోవచ్చు.

ఆయన జర్నీ లో బాధ ఉంది, కోపం ఉంది, సరదాలు ఉన్నాయి, ఒళ్ళు గగురుపొడిచే పోరాటాలు ఉన్నాయి, లవ్ ట్రాక్ ఉంది, ఇలా ఒక్కటా రెండా, ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలో ఏవేవి ఉండాలో అవన్నీ ఉన్నాయి. అందుకే ఈ సీజన్ లో టైటిల్ విన్నర్ రేస్ లోకి జనాలు అతన్ని తీసుకొచ్చారు. గౌతమ్ కి ఫిజికల్ బలం ఒక్కటే కాదు. గొప్ప బుధ్హి బలం కూడా ఉంది. ఆ బుద్ధి బలంతో ఆయన ఆడిన ఎన్నో మాస్టర్ మైండ్ గేమ్స్ ని బిగ్ బాస్ టీవీ టెలికాస్ట్ చూపించలేదు. అవన్నీ చూపించి ఉంటే ఈరోజు ఆయన గ్రాఫ్ ఇంకా ఎక్కువగా ఉండేది. అప్పట్లో అన్యాయం చేసిన బిగ్ బాస్, ఇప్పుడు అతని విషయం లో న్యాయం చేసాడు అనే చెప్పాలి. ఇలాంటి ఆదర్శవంతమైన బిగ్ బాస్ జర్నీ భవిష్యత్తులో మనం చూడాలన్నా చూడలేం, గౌతమ్ లాంటి కంటెస్టెంట్ మళ్ళీ రాడు.