https://oktelugu.com/

SPY Collections: ‘స్పై’ మూవీ మొదటి రోజు వసూళ్లు..డివైడ్ టాక్ తో కూడా ఇదేమి అరాచకం సామీ!

టాక్ ఇంత డివైడ్ గా వచ్చినప్పటికీ బక్రీద్ పండుగ కారణంగా ఓపెనింగ్స్ అనకాపల్లి నుండి అమెరికా వరకు దంచికొట్టేసింది. ఈ స్థాయి ఓపెనింగ్స్ నిఖిల్ కి ఇప్పటి వరకు రాలేదు. ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ ఓపెనర్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. కేవలం అమెరికా నుండే ఈ సినిమా లక్ష 50 వేల అమెరికన్ డాలర్స్ వచ్చాయి.

Written By: , Updated On : June 29, 2023 / 05:50 PM IST
SPY Collections

SPY Collections

Follow us on

SPY Collections: యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్పై’ నేడు తెలుగు మరియు హిందీ భాషల్లో నేడు భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే టీజర్ మరియు ట్రైలర్ రేపిన అంచనాల కారణంగా వల్లనో ఏమో తెలియదు కానీ, ఈ సినిమా మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఒక రేంజ్ స్పై థ్రిల్లర్ గా ఊహించుకొని థియేటర్ కి వెళ్తే రొటీన్ సినిమాని చూపించారని ప్రేక్షకులు విరుచుకుపడ్డారు.

టాక్ ఇంత డివైడ్ గా వచ్చినప్పటికీ బక్రీద్ పండుగ కారణంగా ఓపెనింగ్స్ అనకాపల్లి నుండి అమెరికా వరకు దంచికొట్టేసింది. ఈ స్థాయి ఓపెనింగ్స్ నిఖిల్ కి ఇప్పటి వరకు రాలేదు. ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ ఓపెనర్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. కేవలం అమెరికా నుండే ఈ సినిమా లక్ష 50 వేల అమెరికన్ డాలర్స్ వచ్చాయి.

ఇక నైజాం ప్రాంతం లో అయితే హైదరాబాద్ సిటీ తో పాటుగా, జిల్లాల్లో కూడా కళ్ళు చెదిరే రేంజ్ వసూళ్లను రాబట్టింది. మొత్తం మీద ఈ సినిమాకి మొదటి రోజు నైజాం ప్రాంతం లో మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట. మ్యాట్నీ షోస్ , నూన్ షోస్ కంటే బెటర్ గా ఉండడం శుభ పరిణామం అని చెప్పొచ్చు.ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే నూన్ షోస్ నుండే ఈ సినిమా విశ్వరూపం చూపించేసిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే టికెట్ ముక్క కూడా దొరకలేదట, ఆ స్థాయి ఓపెనింగ్ దక్కింది.

మొత్తం మీద ఈ చిత్రం చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 6 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 17 కోట్ల రూపాయలకు జరిగింది. లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి చాలా తేలికగా బ్రేక్ ఈవెన్ అవుతుందని ఆశిస్తున్నారు మేకర్స్, చూడాలి మరి.