Homeఎంటర్టైన్మెంట్Niharika Konidela Sudigali Sudheer Movie: నిహారిక నిర్మాతగా.. సుడిగాలి సుధీర్ హీరోగా సరికొత్త చిత్రం.....

Niharika Konidela Sudigali Sudheer Movie: నిహారిక నిర్మాతగా.. సుడిగాలి సుధీర్ హీరోగా సరికొత్త చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే..

Niharika Konidela Sudigali Sudheer Movie: బుల్లితెర లో ప్రస్తుతం సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) కి ఉన్నంత డిమాండ్ ఏ ఆర్టిస్ట్ కి కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా పాపులారిటీ ని సంపాదించుకున్న ఆయన, ఆ తర్వాత హీరో గా కూడా పలు సినిమాల్లో నటించాడు. వాటిల్లో ‘గాలోడు’ అనే చిత్రానికి కమర్షియల్ గా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా తర్వాత సుధీర్ నుండి విడుదలైన ‘ఆపరేషన్ సహస్ర’ కి మిశ్రమ ఫలితం దక్కింది. ఈ చిత్రం సుధీర్ నుండి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే చిత్రం చేసాడు కానీ , ఈ సినిమా ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన ‘హైలెస్సో’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతోంది.

ఒకపక్క సినిమాలు చేస్తూనే , మరోపక్క టీవీ షోస్ మరియు ఓటీటీ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు సుధీర్. ఆయన యాంకర్ గా వ్యవహరిస్తున్న పాపులర్ డ్యాన్స్ షో ‘ఆట’ కి జీ తెలుగు లో ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. ఈ వీకెండ్ జరగబోయే గ్రాండ్ ఫినాలే తో ఈ ‘ఆట’ మొదటి సీజన్ పూర్తి అవ్వబోతుంది. అయితే గత వారం జరిగిన ఎపిసోడ్స్ లో సుధీర్ , నిహారిక మరియు సీనియర్ హీరోయిన్ రాధికా కలిసి ఒక ఫన్నీ స్కిట్ వేశారు. ఈ స్కిట్ లో ముందుగా నిహారిక సుధీర్ వద్దకు వచ్చి నిన్ను హీరో గా పాతిక కోట్ల రూపాయిల బడ్జెట్ పెట్టి సినిమా తీయబోతున్నాను అంటుంది. అదే సమయం లో రాధికా కూడా వచ్చి నేను కూడా నీతో సినిమా తీయబోతున్నాను అంటుంది. ఇద్దరికీ కమిట్మెంట్స్ ఇచ్చిన తర్వాత సుధీర్ తన తోటి టీం మేట్స్ తో చేసిన కామెడీ వేరే లెవెల్ లో ఉంటుంది.

అయితే అది కేవలం స్కిట్ మాత్రమే, నిజ జీవితం లో కూడా సుడిగాలి సుధీర్ ని హీరో గా పెట్టి ఒక సినిమా తీయడానికి నిహారిక కొణిదెల సిద్ధంగా ఉందట. ‘రాకాస ‘ చిత్రం తో భారీ హిట్ ని అందుకున్న మానస శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందట. పాతిక కోట్ల రూపాయిల బడ్జెట్ కాదు కానీ, ఒక మంచి సబ్జెక్టు ని సుధీర్ కోసం రెడీ చేశారట. కాస్త యావరేజ్ గా ఉన్నా పర్వాలేదు , సుధీర్ సినిమాలకు జనాలు కదులుతారని ‘గాలోడు’ చిత్రం రుజువు చేసింది. కాబట్టి సుధీర్ తో ఒక మంచి సబ్జెక్టు ని ఎంచుకొని సినిమా తీస్తే కచ్చితంగా భారీ లెవెల్ లో వర్కౌట్ అవుతుందని బలంగా నమ్ముతుంది నిహారిక కొణిదెల. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version