Niharika on Divorce: మెగా బ్రదర్ నాగబాబు(Konidela Nagababu) కూతురు నిహారిక కొణిదెల(Konidela Niharika) వివాహ మహోత్సవం ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొన్నాళ్ళు తన భర్త చైతన్య తో మంచి దాంపత్య జీవితమే కొనసాగించింది కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల వీళ్లిద్దరి వైవాహిక జీవితానికి శుభం కార్డు పడింది. తప్పు ఎవరిదీ?, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది వంటి వివరాలు ఎవరికీ తెలియదు కానీ, నిహారిక కొణిదెల మాత్రం విడిపోయిన తర్వాత తన తండ్రి ఇంట్లో ఉంటూ, నచ్చిన పని చేసుకుంటూ, తన సొంత కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం లోనే ఆమెకు ‘కమిటీ కుర్రాళ్ళు’ వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది. కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ చిత్రం నిర్మాతగా నిహారిక ని నిలబెట్టింది. ఇది కాస్త ఆమెకు ఉపశమనం కలిగించే విషయం అని చెప్పొచ్చు.
అయితే గతం లో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన విడాకుల వ్యవహారం గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో ఇప్పుడు మరో సారి వైరల్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ ‘అందరూ నాది లవ్ మ్యారేజ్ అని అనుకుంటున్నారు. మీకేం తెలుసు నేను మ్యారేజ్ చేసుకున్నాను అనేది. మేము ఎందుకు విడిపోయాము అనేది నా వ్యక్తిగతం. నాకు తగిలిన దెబ్బకు నొప్పి నాకు మాత్రమే తెలుస్తుంది. మీకు కాదు. ఎందుకు విడాకులు తీసుకున్నానో, నాకు మాత్రమే తెలుసు’ అంటూ చెప్పుకొచ్చింది నిహారిక. అదే విధంగా విడాకులు తీసుకున్న సమయం లో తన తండ్రి నాగబాబు గురించి ఆమె మాట్లాడిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆమె మాట్లాడుతూ ‘మా నాన్న నన్ను ఎప్పుడు భారం లాగా భావించలేదు. ఒక బాద్యతగానే భావించాడు. మా నాన్న కి 65 ఏళ్ళ వయస్సు అయ్యుండొచ్చు కానీ, ఆయన ఇంకా పాత కాలం లోనే ఆగిపోలేదు’.
Also Read: ‘హరి హర వీరమల్లు’ బాయికాట్ అన్నారు.. మరి అది పనిచేసిందా?
‘జనరేషన్ కి తగ్గట్టు తనని తానూ అప్డేట్ చేసుకున్నాడు. నీకు 60 ఏళ్ళు వచ్చినా నేను చూసుకుంటాను, వచ్చేయ్ మన ఇంటికి అన్నాడు. మా నాన్న తో పాటు మా అన్నయ్య కూడా నాకు ఆ దేవుడు ఇచ్చిన అరుదైన బహుమతి లాగా భావిస్తూ ఉంటాను’ అంటూ ఎంతో ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది నిహారిక కొణిదెల. ఈ వీడియో క్రింద కామెంట్స్ లో నెటిజెన్స్ ‘మీ నాన్న సంతోషం గా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన లోలోపల ఎంత బాధ పడుతున్నాడో ఆయనకు మాత్రమే తెలుసు. ఒక తండ్రి బాధ ని ఎవ్వరూ ఊహించలేరు’ అంటూ చెప్పుకొచ్చారు.