IND Vs NZ: అది మాయాజాలం కాదు.. అంతకుమించి.. అది ఇంద్రజాలం కాదు.. అంతకుమించి. బంతి మామూలుగా మెలికలు తిరగలేదు. గుండ్రంగా బొంగరం లాగా తిరుగుకుంటూ వచ్చింది. చూస్తుండగానే చేయాల్సిన నష్టం చేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ బ్యాటర్లకు పెవిలియన్ చేరుకోవడం మినహా మరో గత్యంతరం లేకుండా పోయింది.
Also Read: మైదానంలో టీమిండియా మీద గెలవలేరు..ఫైనల్ లో మాత్రం కివీస్ కు సపోర్టు.. ఏం బతుకులు రా మీవి?!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ – న్యూజిలాండ్ (IND vs NZ) ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ తీసుకున్న నిర్ణయం తప్పని టీమిండియా స్పిన్ బౌలర్లు నిరూపించారు. ప్రారంభంలో మహమ్మద్ షమీ, హార్థిక్ పాండ్యా బౌలింగ్ వేయగా.. వారిద్దరిని న్యూజిలాండ్ బౌలర్లు ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా బౌలింగ్లో పరుగులు పిండుకున్నారు. న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర (29 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్: 37) దూకుడుగా ఆడాడు. మరో ఆటగాడు విలియం యంగ్(15) కాస్త సమయమనంతో ఆడాడు. వీరిద్దరి తొలి వికెట్ కు 7.5 ఓవర్లలో 57 పరుగులు జోడించారు. వీరిద్దరి జోడి ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దింపాడు. వరుణ్ చక్రవర్తి వేసిన అద్భుతమైన బంతిని డిపెండ్ చేయలేక యంగ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో తొలివికెట్టు భాగస్వామ్యానికి యంగ్ తెరదించాడు.
8 బంతుల వ్యవధిలో..
అప్పటిదాకా ఒక వికెట్ కోల్పోయి న్యూజిలాండ్ జట్టు.. 10 ఓవర్ కు వచ్చేసరికి 69 పరుగులు చేసింది. ఓవైపు రచిన్ రవీంద్ర, మరోవైపు విలియంసన్ ఉండడంతో భారత శిబిరంలో ఎక్కడో భయం నెలకొంది. దక్షిణాఫ్రికా మీద చేసినట్టుగానే తమపై కూడా భారీగా పరుగులు చేస్తారని టీమిండియా అభిమానులు ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కులదీప్ యాదవ్ ను రోహిత్ శర్మ రంగంలోకి దింపాడు. దీంతో తను వేసిన తొలి బంతికే అత్యంత ప్రమాదకరమైన రచిన్ రవీంద్రనాథ్ కులదీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు. అద్భుతమైన బంతివేసి అతని వికెట్లను గిరాటేశాడు. కులదీప్ యాదవ్ వేసిన బంతి వికెట్లను గిరాటేయడంతో రచిన్ రవీంద్ర ఒకానొక దశలో నమ్మలేదు. అంతా మాయ అనుకుంటూనే క్రీజ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత విలియంసన్ ను కులదీప్ యాదవ్ అద్భుతమైన బంతితో వెనక్కి పంపించాడు. విలియంసన్ క్రీజ్ లో నిలదొక్కుకుంటే ఎంత డేంజరో కులదీప్ యాదవ్ కు తెలుసు. అందువల్లే అతనికి ఊరించే బంతిని వేయడంతో ముందుకు వచ్చి ఆడాడు. కానీ ఆ బంతి బ్యాట్ హ్యాండిల్ కు తగిలి గాల్లో లేచింది. దీంతో కులదీప్ యాదవ్ ఆ బంతిని అమాంతం పట్టుకున్నాడు. కేవలం ఎనిమిది బంతుల వ్యవధిలోనే రచిన్ రవీంద్ర, విలియం సన్ వికెట్లు తీసి న్యూజిలాండ్ జట్టుకు కోలుకోలేని షాకిచ్చాడు. రచిన్ రవీంద్ర, విలియంసన్ దక్షిణాఫ్రికా మీద దూకుడుగా బ్యాటింగ్ చేశారు. భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే అంత అవకాశాన్ని కులదీప్ యాదవ్ టీమిండియా మీద ఇవ్వలేదు. పైగా మ్యాజికల్ డెలివరీలు వేసి ప్రమాదకరమైన ఇద్దరు ఆటగాళ్లను వెనక్కి పంపించాడు.
Also Read: తిప్పేసిన కుల్ దీప్.. రచిన్, విలియంసన్ వికెట్లు తీసి ఇండియా వైపునకు మ్యాచ్