గ్లామర్ విషయంలో నూటికి నూట యాభై మార్కులు తెచ్చుకున్నా, ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో మంటలు రేపుతోన్నా.. నటన విషయంలో మాత్రం ఈ హాట్ బ్యూటీకి పెద్దగా మార్కులు పడకపోవడంతో స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ మిస్ అయిపోయాయి. దాంతో సైడ్ ఇన్ కమ్ కోసం ఈ భామ కొత్త దారులు వెతుక్కుంటుంది.
సోషల్ మీడియాలో బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ.. బాగానే సంపాదిస్తోంది. తాజాగా ఓ హోటల్ కి సంబంధించిన కంపెనీని ప్రమోట్ చేస్తోంది. అలాగే మిగిలిన కంపెనీలను కూడా అప్రోచ్ అవుతూ మీ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తా అని ముందుకుపోతుందట. ఇక సినిమాల విషయానికి వస్తే నిధి ప్రస్తుతం అశోక్ గల్లా డెబ్యూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.