https://oktelugu.com/

దేవాలయాల్లో కోవిడ్ కేంద్రాల ఏర్పాటుపై విమర్శలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య ఎక్కువ కావడంతో సర్కారు రోగుల కోసం కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కానీ ఏపీలోని దేవాలయాల్లో కోవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంపై పలు పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. జగన్ కు ఏం దొరకలేదా? స్కూళ్లు, కాలేజీలు ఖాళీగానే ఉన్నా దేవాలయాలను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తున్నారు. అదే చర్చిలు, మసీదుల జోలికి ఎందుకు వెళ్లడం లేదని తమ ఆవేశాన్ని వెల్లగక్కుతున్నారు. దీనిపై రాజకీయ దుమారమే రేగుతోంది. సీఎం […]

Written By: , Updated On : May 18, 2021 / 06:54 PM IST
Follow us on

COVID Centersఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య ఎక్కువ కావడంతో సర్కారు రోగుల కోసం కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కానీ ఏపీలోని దేవాలయాల్లో కోవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంపై పలు పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. జగన్ కు ఏం దొరకలేదా? స్కూళ్లు, కాలేజీలు ఖాళీగానే ఉన్నా దేవాలయాలను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తున్నారు. అదే చర్చిలు, మసీదుల జోలికి ఎందుకు వెళ్లడం లేదని తమ ఆవేశాన్ని వెల్లగక్కుతున్నారు. దీనిపై రాజకీయ దుమారమే రేగుతోంది. సీఎం జగన్ దీనికి సమాధానం చెప్పాలని బీజేపీ, టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఆలయాల్లోనే ఎందుకు?
రాష్ర్టంలోని ప్రముఖ ఆలయాల్లో కోవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం తగదని బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ విమర్శిస్తున్నారు. రాష్ర్టంలో 16 పెద్ద ఆలయాల్లో వెయ్యి పడకలతో కోవిడ్ కేంద్రాలు నెలకొల్పారు. చాలా చోట్ల 100 పడకలు, కొన్ని చోట్ల 25 పడకలతో కోవిడ్ సెంటర్ల ఏర్పాటు చేశారు. దీంతో నాయకులు మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కోవిడ్ కేంద్రాల ఏర్పాటు ఏమిటని బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.

చర్చి, మసీదులు కనపించడం లేదా?
రాష్ర్టంలో దేవాలయాలే ఉన్నాయా? చర్చిలు, మసీదులు కనిపించడం లేదా అని బీజేపీ రాష్ర్ట కార్యదర్శి నాగోతు రమేశ్ ప్రశ్నిస్తున్నారు. చర్చి, మసీదులను ఎందుకు అత్యవసర సేవలకు వినియోగించడం లేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ కు హిందూ మతంపై ఉన్న ద్వేషంతోనే ఇలాచేస్తున్నారని ఘాటుగా స్పందించారు. హిందువుల ఆలయాల్లోనే కోవిడ్ కేంద్రాలు పెట్టడంలో ఆంతర్యమేమిటో తేల్చాలన్నారు.

స్కూళ్ల, కాలేజీలు పనికి రావా?
రాష్ర్టంలో పెద్దపెద్ద పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. అవి పనికి రావా? వాటిలో కోవిడ్ కేంద్రాల ఏర్పాటు చేస్తే తప్పేముందని చెబుతున్నారు. మత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించడం దారుణమన్నారు. మత స్వాతంత్ర్య స్వేచ్ఛను హరంచే పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం ఇలాగే చేస్తే తగిన గుణపాఠం చెబుతామని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్పందించి దేవాలయాల్లో కోవిడ్ కేంద్రాలు తొలగించి మా మనోభావాలను గౌరవించాలని సూచించారు.