బోల్డ్ భామ ‘నిధి అగర్వాల్’ తన బోల్డ్ లుక్స్ తో పాటు తన బోల్డ్ కామెంట్స్ తో కూడా వైరల్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం నిధికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే.. ఈ హాట్ బ్యూటీ తన ఇన్ స్టాగ్రాంలోని 12 మిలియన్ల ఫాలోవర్స్ కోసం 12 సీక్రెట్స్ చెప్పడానికి రెడీ అయింది. ఈ క్రమంలో ప్రతీ రోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఓ సీక్రెట్ ను రివీల్ చేస్తూ వస్తోంది.
ఆల్ రెడీ ఇప్పటికే తన గోర్లు, తన జుట్టు పై రెండు సీక్రెట్లను చెప్పింది. అలాగే పనిలో పనిగా తన గోర్లు, తన జుట్టుకు సంబంధించిన సీక్రెట్స్ చెబుతూనే.. వాటి సౌందర్యాన్ని కాపాడుకునేందుకు తానూ వాడే ఉత్పత్తులను కూడా ప్రమోట్ చేస్తూ… ఆ రకంగానూ సంపాదనను వెతుక్కుంది. ఇక తాజాగా నిధి అగర్వాల్ మూడో సీక్రెట్ ను రివీల్ చేసింది.
తాను ఉదయం లేవగానే రోజూ నిమ్మకాయ వేడి నీళ్లు తాగుతాను అని చెప్పుకొచ్చింది. నిమ్మకాయ వేడి నీళ్లు సహజసిద్దమైన వెనిగర్ వంటిదని.. మన జీర్ణ శక్తిని పెంచుతుందని.. రోజంతా మనం ఎనర్జీతో ఉండేలా సాయపడుతుందని నిధి తెలియజేసింది. ఏది ఏమైనా ఈ సీక్రెట్స్ రివీల్ చేస్తోన్న పేరుతో నిధి అగర్వాల్ కొన్ని ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ క్యాష్ చేసుకుంటుంది.
ఇక లిప్ కిస్ ల్లో బోల్డ్ సీన్స్ లో ఎలాంటి ఇబ్బంది పడకుండా నటించే ఈ హాట్ భామ, పాత్ర డిమాండ్ చేస్తే పరిధి దాటి నటించడానికి కూడా తానూ ఎప్పుడు సిద్దమే అంటూ తేల్చి చెప్పింది. అయినా ఎక్స్ పోజింగ్ విషయంలో ఈ తరంలో నిధి అగర్వాల్ ని మించిన హీరోయినే లేదనే టాక్ కూడా ఉంది. ఇక నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
https://www.instagram.com/nidhhiagerwal/