
ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో అనూహ్య మలుపులు జరుగుతున్నాయి. ఏ జట్టు విజయం సాధింస్తోందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే తొలతు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యార్ 43 పరుగులతో రాణించాడు. అలాగే హిట్ మెయర్ 28 కాసేపు మెరుపుు మెరిపించాడు.
టాస్ ఓడి బ్యాంటింగ్ కు దిగిన ఢిల్లీకి తొలి మూడు ఓవర్లలో 18 పరుగులు మాత్రమే వచ్చాయి. కార్తీక్ త్యాగి వేసిన నాలుగో ఓవర్ లో తొలి బంతికే ఓపెనర్ శిఖర్ ధావన్ ఔటయ్యాడు. అలాగే చేతన్ సకారియా బౌలింగ్ లో మరో ఓపెనర్ పృథ్వీ షా కూడా ఔటయ్యాడు. దీంతో 21 పరుగులకే ఢిల్లీ జట్టు ఓపెనర్లను కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన రిజబ్ పంత్ 24 పరుగులు చేశాడు. అయితే, ముస్తాఫిజుర్ వేసిన 12వ ఓవర్ లో పంత్ ఔటయ్యాడు.
అలాగే ప్రమాదకరంగా మారుతున్న శ్రేయస్ అయ్యార్ ను రాహుల్ తెవాతియా 14వ ఓవర్ లో పెవిలియన్ కి పంపించాడు. వీరిద్దరు ఔటైన తర్వాత హెట్ మైర్ కాసేపు మెరుపులు మెరిపించాడు. ముస్తాఫిజుర్ ఓవర్ లో హెట్ మైర్ సకారియాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అలాగే వేగంగా ఆడబోయి సకారియా బౌలింగ్ లో మిల్లర్ కి చిక్కాడు. ఆరంభంలోనే స్వల్ప స్కోరుకే ఓపెర్లు వెనుదిరిగినప్పటికీ మిడిలార్డర్ ఆదుకోవడంతో ఢిల్లీ చెప్పుకోదగ్గ స్కోరు చేసింది.