Ram Charan: మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో చెర్రితో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, ప్రోమోలు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి . ఇదిలా ఉండగా, మరోవైపు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా.. దర్శకుడు శంకర్ ఓ భారీ పాన్ ఇండియా సినిమాకు తెరలేపారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా మొదలైంది. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇందులో సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసిన శంకర్.. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌కి రెడీ అవుతున్నట్లు సమాచారం.
ఈ నవంబరు 15 నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నట్లు ఇండస్ట్రీలో టాక్. హైదరాబాద్‌లోనే ఈ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్‌తో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. ఈ చిత్రంలో కియారా హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం ఇస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు రోబోతో భారీ హిట్ కొట్టిన శంకర్. ఆతర్వాత వచ్చిన ఐ, రోబో2.0 సినిమాలు భారీ డిజాస్టర్‌ను మూటకట్టుకున్నాయి. దీంతో శంకర్- చెర్రి కాంబినేషన్లో వచ్చే సినిమా ఎలా ఉండబోతోందనే విషయంపై అనేక ఊహాగానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరోవైపు, భారతీయుడు 2 సినిమా కూడా శంకర్ తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కాగా, రామ్‌చరణ్ ఆచార్య సినిమాలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమా విడుదల కానుంది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: New update from the combination of shankar and ram charan movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com