Radhe Shyam 1st Song: రాధేశ్యామ్ నుంచి తొలి పాట.. అది అద్భుతమైన విజువల్స్ తో యానిమేషన్ ఫెస్టివల్ లా వచ్చింది. ‘ఎవరో వీరెవరో కలవని ప్రేమికులా… ఎవరో వీరెవరో.. విడిపోని యాత్రికులా’ అంటూ సాగిన ఈ పాటలో మొత్తం సినిమా కంటెంట్ నే క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ రొటీన్ గానే ఉంది. లవ్ స్టోరీ అంటేనే ఎక్కడో ఏదొక పాయింట్ కలుస్తోంది. పూర్తి విభిన్నంగా సినిమా ఉంటుంది అని ఆశించలేం. కానీ, రాధేశ్యామ్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఆ అంచనాలను రాధేశ్యామ్ ఎంతవరకు అందుకుంటాడో అని డౌట్ పెరిగిపోతుంది. నిన్న రిలీజ్ అయిన ఈ పాటలో మంచి విజువల్స్ ఉన్నాయి గాని, కంటెంటే అసంతృప్తిగా ఉంది. అసలు ఒక స్టార్ హీరో సినిమా నుంచి మొదటి పాట వస్తోంది అంటే.. సాధారణంగా లిరికల్ వీడియోని రిలీజ్ చేస్తారు. లేదా, సినిమాలోని షార్ప్ షాట్స్ ను, లేదంటే సరదాగా కనిపించే వర్కింగ్ స్టిల్స్ ను వెతికి లిరికల్ వీడియోలో ఎడిట్ చేసి పెడతారు.
ఒక్కోసారి సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడితే.. సినిమాలోని పాటనే చూపిస్తూ సినిమాను జనంలోకి తీసుకుపోవడానికి తగిన కసరత్తులు చేస్తారు. కానీ, రాధేశ్యామ్ ఇవేమీ చేయలేదు. తనకు తోచిన పాటతో ప్రేక్షకులను పలకరించింది. రాధే శ్యామ్ కొత్త పంథాలో వచ్చాడు అని పేరు అయితే వచ్చింది గానీ, యానిమేషన్ రూపంలో ప్రభాస్, పూజా హెగ్డేలు అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు.
కొన్ని షాట్స్ లో అయితే, ప్రభాస్ యానిమేషన్ షాట్స్ చాలా కామెడీ గా అనిపించాయి. అయినా పాటలోనే కథను చూపించాలనుకోవడం సరైన పద్దతి అనిపించుకోదు. ఇంతకీ ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక హస్త సాముద్రికం నేపథ్యంలో సాగే అచ్చమైన సగటు ప్రేమ కథ. ప్రేమికుల్ని విధి ఎలా కలిపింది, ఎలా విడదీసింది? అబ్బో ఈ పాయింట్ విని విని విసిగిపోయాం అంటారా ?
అయినా తప్పదు. ప్రభాస్ రాధేశ్యామ్ కథ ఇదే పాయింట్ తో తెరకెక్కింది. అందుకే, పంచ భూతాలు అనే కాన్సెప్ట్ లో ఈ సినిమా మొదటి పాటను డిజైన్ చేసి వదిలారు. పాటలో కూడా భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం.. ఇవన్నీ ప్రేముకులకు ఎలా అవరోధాలు అయ్యాయి అనే కోణంలో చూపించారు. కాకపోతే పాట స్లోగా ఉన్నట్టే.. సినిమా కూడా బాగా స్లోగా ఉంటుందా ? ఇప్పుడు ఇదే భయం పట్టుకుంది ప్రభాస్ ఫ్యాన్స్ కు.
Also Read: అప్పుడు జగ్గుభాయ్ – ఇప్పుడు శ్రీకాంత్.. బోయపాటి స్కెచ్ ఇదేనా?
పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్… “భీమ్లా నాయక్” రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?