https://oktelugu.com/

Bellamkonda Srinivas: పోటీకి సై అంటున్న బెల్లంకొండ… స్టూవర్టుపురం దొంగ నుంచి వరుస పోస్టర్లు

Bellamkonda Srinivas: ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన విషయం “టైగర్ నాగేశ్వరరావు జీవితం చరిత్ర “. 1970 సంవత్సరంలో స్టూవర్టుపురం అనే ఊరిలో నాగేశ్వరరావు అనే పేరుమోసిన ఒక గజదొంగ ఉండేవాడు. అతను స్కెచ్ వేస్తే తిరుగుండదని… పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టేలా చోరీలు చేసేవాడు అని పేరుంది. అతని తెగువకు గాను ఆ ప్రాంత ప్రజలంతా ఆయనకు “టైగర్” అనే బిరుదు ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే ఆయన బయోపిక్ పై ‘స్టూవర్ట్ పురం దొంగ’ అనే […]

Written By: , Updated On : November 5, 2021 / 07:13 PM IST
Follow us on

Bellamkonda Srinivas: ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన విషయం “టైగర్ నాగేశ్వరరావు జీవితం చరిత్ర “. 1970 సంవత్సరంలో స్టూవర్టుపురం అనే ఊరిలో నాగేశ్వరరావు అనే పేరుమోసిన ఒక గజదొంగ ఉండేవాడు. అతను స్కెచ్ వేస్తే తిరుగుండదని… పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టేలా చోరీలు చేసేవాడు అని పేరుంది. అతని తెగువకు గాను ఆ ప్రాంత ప్రజలంతా ఆయనకు “టైగర్” అనే బిరుదు ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే ఆయన బయోపిక్ పై ‘స్టూవర్ట్ పురం దొంగ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

new poster release from bellamkonda srinivas stuartpuram donga movie

 ఈ మూవీకి కేఎస్ దర్శకత్వం వహిస్తుండగా… మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. అయితే దీపావళి కానుకగా గురువారం ఈ మూవీకి సంబంధించి ఒక పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కాగా ఈరోజు మరో పోస్టర్ ను బెల్లంకొండ  సాయి శ్రీనివాస్ ట్వీట్ చేశాడు. ఈ పోస్టర్స్ లో బెల్లంకొండ శ్రీ‌నివాస్ పొడ‌వాటి జుట్టు తో, గుబురు గ‌డ్డం తో మాస్ లుక్ లో అదరగొట్టాడని చెప్పాలి.  అలాగే చేతిలో రెండు తుపాకులు ప‌ట్టుకుని సీరియ‌స్ గా  చూస్తు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు.

కాగా మరోవైపు రవితేజ కూడా నాగేశ్వరరావు అదే బయోపిక్ పై టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా… అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ​, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్​ను కూడా విడుదల చేశారు.  మరి వీరిద్దరిలో ఎవరు హిట్ కొడతారో… చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.