కరోనా సెకండ్ వేవ్ నుంచి మహారాష్ట్ర నెమ్మదిగా కోలుకుంటూ ఉంది. ఇప్పటికే ముంబైలో సాధారణ జీవనం మొదలైంది. జనం తమ పనుల్లో ఎవరికీ వాళ్ళు ఫుల్ బిజీ అయిపోయారు. మరోపక్క బాలీవుడ్ పెద్ద సినిమాలు కూడా షూటింగ్స్ కి రెడీ అయిపోయాయి. వచ్చే సోమవారం నుంచి ముంబైలో పెద్ద ఎత్తున షూటింగ్ లు స్టార్ట్ కాబోతున్నాయి.
అన్ని సినిమాలు ఒకేసారి షూట్ లో బిజీగా ఉండటంతో ఇప్పుడు ఆర్టిస్ట్ లకు పెద్ద సమస్య వచ్చి పడింది. స్టార్ హీరోల సినిమాలకు ఒకే టైంలో డేట్లు కేటాయించాల్సిన పరిస్థితి. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు పలు సమస్యల్లో ఇరుక్కుపోయారు. ఏ హీరో సినిమాని కాదు అనాలి. ఏ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో తెలియక వాళ్ళు సతమతమవుతున్నారు.
ఇక షారుక్ ఖాన్ నటిస్తున్న బిగ్ మూవీ ‘పఠాన్’ ఈ నెల 21 నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకోబోతుంది. ఈ సినిమా కోసమే దాదాపు పెద్ద నటీనటులు అందరూ తమ డేట్స్ ను కేటాయించారు. దాంతో రణబీర్ కపూర్ సినిమాలకి కూడా పెద్ద సమస్యగా మారింది. రణబీర్ కపూర్ రెండు సినిమాల షూటింగులు వచ్చే వారం సెట్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆర్టిస్ట్ లు రణబీర్ కపూర్ సినిమాలకు డేట్స్ ఇవ్వలేని పరిస్థితి.
ఇక సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగణ్ సినిమాల షూటింగ్స్ కూడా జులైలో ప్రారంభం కానున్నాయి. మరి ఆ సినిమాలకు కూడా ఆర్టిస్ట్ ల డేట్ల సమస్య రానుంది. మొత్తానికి బిజీగా ఉండే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. అలాగే రేపు టాలీవుడ్ లోని స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల పరిస్థితి కూడా ఇలాగే ఉండనుంది.