బాలయ్య సినిమా బోయపాటికి కొత్త తలనెప్పి తెచ్చి పెట్టిందట. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో బోయపాటి శ్రీను చేస్తోన్న సినిమా పనులు ఓ కొలిక్కి వచ్చేలా కనబడటం లేదు. ఈ సినిమాకి హై బడ్జెట్ అని నిర్మాత లెక్కలు ఆరా తీస్తున్నాడట. నిజానికి 60 కోట్లు బడ్జెట్ ను బోయపాటి 40 కోట్లకు కుదించాడు. అయితే కరోనా దెబ్బకు బడ్జెట్ ఇంకా కుదించాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో బోయపాటి స్క్రిప్ట్ లో కొన్ని యాక్షన్ సీన్స్ ను తగ్గించడటంతో పాటు రెండు సాంగ్స్ ను కూడా తీసేసాడు. కేవలం బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకునే బోయపాటి స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి.. పైగా రెమ్యునరేషన్ ని తగ్గించుకునే విధంగా బాలయ్యను బోయపాటి ఒప్పించాడు. అయితే ఈ సినిమా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బోయపాటిని కూడా రెమ్యునరేషన్ తగ్గించుకోవల్సిందిగా డిమాండ్ చేస్తున్నాడట.
Also Read: చరణ్ తో వంశీ పాన్ ఇండియా సినిమా !
మాస్ డైరెక్టర్ గా వరుస హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ గా రికార్డ్స్ ఉన్న తనకు..ఒక నిర్మాత నుండి ఇలాంటి డిమాండ్ వచ్చే సరికి బోయపాటి కాస్త ఫీల్ అవుతునట్లు తెలుస్తోంది. నిజానికి బోయపాటి ఆల్ రెడీ తన రెమ్యునరేషన్ లో ముప్పై శాతం తగ్గించుకున్నాడట. అయినా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఇంకా రెమ్యునరేషన్ ను తగ్గించుకోమని అడగడం బోయపాటికి అస్సలు నచ్చలేదని.. ఆయన తన సన్నిహితుల దగ్గర తన అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నాడని తెలుస్తోంది. మొత్తానికి రామ్ చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్లాప్ తరువాత, బోయపాటి క్రేజ్ బాగా తగ్గింది. గతంలో ఇచ్చిన హిట్స్ ఫలితంగా బాలయ్య బాబు, బోయపాటికి పిలిచి అవకాశం ఇచ్చినా.. బాలయ్య సినిమాకి నిర్మాతలను ఒప్పించుకోవడానికి బోయపాటి చాల టైం తీసుకోవాల్సి వచ్చింది.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ షూట్ లో కొత్త మార్పులు !
అందుకే బోయపాటి కూడా నిర్మాత ఆడినంత రెమ్యునరేషన్ ను తగ్గించుకునే ఆలోచనలో ఉన్నారట. మొత్తానికి బాలయ్య సినిమా కోసం బోయపాటి ఎన్నో అవరోధాలు అడ్డంకులను దాటాల్సి వస్తోంది. ఇంతకీ కొత్తగా స్క్రిప్ట్ లో చేస్తోన్న మార్పులు గురించి బాలయ్య ఎలా ఫీల్ అవుతారో తెలియదు. ముఖ్యంగా బాలయ్యకు స్క్రిప్ట్ లో హంగూఆర్భాటాలు మరియు ఫుల్ యాక్షన్ కావాలి. అవి బడ్జెట్ తో కూడుకున్నవి. ఆ లెక్కన బోయపాటికి బాలయ్యను ఒప్పించడం కూడా మరో తలనొప్పి అవుతుందేమో. ఈ సినిమాకి ‘మోనార్క్’ అనే టైటిల్ అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా బాలయ్య ఎప్పటిలాగే డబల్ యాక్షన్ చేస్తున్నాడు.